#చిత్రస్పందన -- 13
*( పువూ - తోడిమ రీతినే , పుడమిన ఆలుమగలుయును !! )*
🌺🍃🌺
*తొడిమకు శోకమె మిగులున్ -*
*బుడమిన వ్రాలంగఁ బూవు , పొద్దుకు సెలవౌ !*
*విడివడుదురాలుమగలున్ -*
*ముడి విప్పగ దైవమదియె ముదిమి వయసునన్ !*
🌺🍃🌺 *( కందము )*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌺🍃🌺
( తోడిమనుండీ పూవు వికసించగా , వాటికవే ఆనందపడుతూ ,
చూచెడి వారలకు కుడా ఆనందము కలిగించుచూ అలరారుతాయి .
ఆ ముచ్చట ఒక పొద్దే ! కుసుమము వ్రాలిపోతే తొడిమకు శోకమే !!
అన్యోన్యముగా మూడుముళ్ళ బంధముతో ఒకటైన ఆలుమగలు ,
వయసు మీరగా విడిపోవు దినము తప్పక వచ్చును .
దైవాజ్ఞ గా వారి ముడి విప్పివేయబడి ఒకరు ఒంటరులౌట తధ్యమే కదా !!
అకటా ఇదియే జీవితము !! ) 🙏🙏
🌺🍃🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి