8, ఆగస్టు 2021, ఆదివారం

*ఆషాఢ అమావాస్య

 🌑 *ఆషాఢ అమావాస్య!!*

*హిందూ ధర్మచక్రం* 🌑


🌚 ఆషాఢ మాసపు అమావాస్యను నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయఫలం లభిస్తుంది. 


🌚 పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానసపుత్రిక పేరు అచ్ఛోద. ఈమె నదీరూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యేళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". 


🌚అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృతర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. 


🌚అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలను కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుని వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతనమహారాజ పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీమతి శ్రీ విద్యగారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించబడినది. )


🌟 *ఆదివారం, ఆగష్టు 8, 2021* 🌟

        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*

      *దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు* 

      *ఆషాఢ మాసం - బహుళ పక్షం*

తిధి : *అమావాస్య0* సా6.45

             తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి 

వారం : *ఆదివారం* (భానువాసరే)

నక్షత్రం : *పుష్యమి* ఉ9.46

              తదుపరి ఆశ్రేష 

యోగం : *వ్యతీపాతం* రా1.07

               తదుపరి వరీయాన్ 

కరణం : *చతుష్పాత్* ఉ6.36

                తదుపరి *నాగవ* సా6.45

              ఆ తదుపరి కింస్తుఘ్నం

వర్జ్యం : *రా11.00 - 12.40* 

దుర్ముహూర్తం : *సా4.46 - 5.37* &

                       *మ12.31 - 1.22*

అమృతకాలం: *లేదు*

రాహుకాలం : *సా4.30 - 6.00* 

యమగండం/కేతుకాలం: *మ12.00 - 1.30*

సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.44* || సూర్యాస్తమయం: *6.28*

 👉 *సర్వ అమావాస్య*

  *పాతార్క యోగం* *పుష్యార్క యోగం*


🙏సర్వే జనా *సుజనో* భవతూ!

సర్వ *సుజనా* సుఖినో భవతూ!!🙏

         🙏 *శుభమస్తు* 🙏

_______________________________   

                 *గోసేవ చేద్దాం*               

           *గోమాత ను పూజిద్దాం*                                                

        *గోవులను రక్షించు కుందాం* 🙏 *ఓం గౌమాత్రే నమః* 🙏

కామెంట్‌లు లేవు: