19, సెప్టెంబర్ 2020, శనివారం

దీపారాధన ప్రాశస్త్యం ఏమిటి?

దీపం లభతే విద్యాం దీపదో లభతే శ్రుతం

దీపదో లభతే చాయుహు దీపదో లభతే దివమ్

దీపం వెలిగించినవారు విద్యావంతులు, ఙ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షం ను పొందుతారు. కార్తీక మాసం లో సాయంత్రం శివాలయం లో దీపం వెలిగించి తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అప్రయత్నం గా అయినా, భక్తి భావన లేకపోయినా దీపం వెలిగించినందువలన అనంతమైన పుణ్య ఫలం వస్తుంది. ఇదే ఫలితం విష్ణు భక్తులు కు కూడా వస్తుంది. కార్తీకమాసంలో నెలరోజులు దీపాలు పెట్టడం సాంప్రదాయం మరియు ఆచారవిధి కూడా ఏదైనా కారణం వలన 30 రోజలు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ద ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో నైనా దీపం వెలిగించి తే వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసం లో శని త్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. పౌర్ణమి కన్నా బహుళ ఏకాదశీ కోటిరెట్లు పుణ్య ఫలితాలు అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశీ కన్నా క్చీరాబ్ధి ద్వాదశి అతి విస్తారమైన అనంత ఫలితాన్నిస్తుందని భాగవతము చెబుతోంది. ఈరోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి.

****************

ప్రమిదలో చమురు మిగిలిపోతే ఏమి చేయాలి?

ముందు రోజు మిగిలి పోయిన చమురు ను తీసివేయాలి. ఇత్తడి కంచు కుందులైతే వాటిని తోముకున్న తరువాత దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదలో దీపారాధన చేసేట్లయితే క్రిందటిరోజున వెలిగించిన వత్తిని మన ఇంట్లో స్టవ్ వెలిగించినప్పుడు ఆ వత్తిని అందులో వేయాలి. అలాగే మిగిలిన చమురు ను ఎవరూ తొక్కనిచోట పారబోయాలి. ఆ తర్వాత కొత్తగా చమురు పోసి వత్తులు వేసి దీపం వెలిగించాలి.

కామెంట్‌లు లేవు: