శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పాదాలు.🙏
ధనం సంపాదించడానికి మానవులు అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే సంపాదించిన ధనాన్ని దాచిపెట్టడం లేదా స్థలాల కొనుగోళ్ళు లేదా వడ్డీవ్యాపారం వంటి వాటిపై వెచ్చిస్తూ ఉంటారు. కొందరు లాభపడినా కొంతమందికి అది చేదు అనుభవంగా మిగిలిపోతుంది. ఇంట్లో ధనం ఎక్కువగా నిలబడకపోయినా, అనవసరమైన అప్పులలో ఇరుక్కున్నా, పాత బకాయిలు తీరడం లేదు అనుకునే వారికి ఒక చక్కటి పరిష్కారం మార్గం ఉంది అదే శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పటం. ఈ ఐశ్వర్య కాళి పాదాల పటాన్ని గుమ్మానికి ముందు అంటే ఇంటి ప్రధాన తలుపుకి తగిలించడంతో పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచి, ఉదయాన్నే కాళి మాత పాదాలను మనసులో ధ్యానించి పటానికి నమస్కరించి దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించాలి.
అసలు ఈ శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పటం విశిష్టత ఏమిటి? అసలు ఈ వాస్తు ఐశ్వర్య కాళి పాదాల పటం ఎవరు ముందుగా వాడుకలోకి తెచ్చారు?
తమిళనాడు రాజధాని చెన్నై పట్టణానికి సమీపంలో అమింజికరై అనే ఊరిలో వీరశాంత కాళీ అమ్మవారి ఆలయం ఉంది. ప్రొఫెసర్ డా. వి. సుకుమారాన్ అనే అమ్మవారి మహాభక్తుడు ఆలయాన్ని నిర్మించారు. ఒకనాటి రాత్రి సుకుమారాన్ గారికి కాళికాదేవి కలలో దర్శనభాగ్యం కలిగించడంతో ఆయన అమ్మవారి పాదాలను పటం చిత్రీకరించి, ఆలయంలో అటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దీనితో ఆయనకు దర్శనం ఇచ్చిన అమ్మవారి పాదాల పటాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకునివచ్చారు. నేడు ఎంతోమంది భక్తులు అమ్మవారి పాదాలు దర్శించుకుని, పూజించి ఆర్ధిక ఇబందుల నుండి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి