19, సెప్టెంబర్ 2020, శనివారం

*ఎన్నడూ అబద్ధం చెప్పనివాడు*


🕉️🌞🌎🏵️🌼🚩


 *ఒక భక్తుడు నేపాల్ లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్లి ఒక రుద్రాక్షమాలతో తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో దాన్ని తను ధరించాలని అనుకున్నాడు.* *మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని స్వామివారి ముందు ఉంచాడు. దాన్ని స్వామివారి తాకితే తనను* *అనుగ్రహించినట్టు అనుకున్నాడు.* 


“ *దీనితో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు?” అని అడిగారు స్వామివారు.* 


 *“ పెరియవ ఆశీస్సులతో దాన్ని నేను వేసుకుందామని* *అనుకుంటున్నాను” అని బదులిచ్చాడు.* 


 *పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.** 


“ *ఇప్పటినుండి నువ్వు అబద్దం చెప్పడం మానివెయ్యగలవా?” అని అడిగారు.* 


 *అతను ఆలోచిస్తున్నాడు. “హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి?”. కాని తప్పకుండా నిజమే* *మాట్లాడాలి ఏది ఏమైనా సరే.* 


 *“అబద్దాలు చెప్పకుండా ఉండలేను పెరియవ”* 


 *“ఏం? ఎందుకు?”* 


“ *నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. కొద్దిగా అబద్దాలు వాడకుండా రికార్డ్స్ తయారుచెయ్యడం కుదరదు. వాటిని ఎలా తయారుచెయ్యాలో నా పై అధికారులు సూచిస్తారు. నేను కాదనలేను”* 


 *స్వామివారు ఆ రుద్రాక్ష మాలను తీసుకుని కాసేపు చేతులతో త్రిప్పుతూ,* *కొద్దిసేపటి తరువాత, “మరైతే ఎవరు అబద్దం ఆడరో వారికి దీన్ని ఇవ్వు” అని ఆదేశించారు.* 


 *అతను ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతో, “అచ్చంగా నా భార్య సూచించినట్టుగానే జరిగింది” అని అన్నాడు.* 


 *ఇతను యాత్ర ముగించుకుని ఆ రుద్రాక్ష మాలతో వచ్చిన తరువాత అతని భార్య అతనితో పూజ గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రానికి మాలగా వెయ్యమని చెప్పింది.* 


“ *పరమాచార్య స్వామివారు చెప్పినట్టే చేస్తాను” అని అతను రుద్రాక్ష మాలను ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఆ మాలను పరమాచార్య స్వామివారి చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక వ్యక్తీ ఉన్నారని ఆరోజే అతనికి అర్థం అయ్యింది.* 


 *అతని భార్య కోరికను పరమాచార్య స్వామివారు తీర్చారు. ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది? టెలిపతి గురించి అందరకూ తెలిసిందే. కాని ఇది కేవలం గురుభక్తి. తరువాత ఒకసారి ఆ భక్తుని బంధువు ఒకరు దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెబుతూ, “అతనిలో హరిశ్చంద్రుని పార్శ్వము కూడా ఉంది” అని అన్నారు మహాస్వామివారు.* 


 *--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్* 


 *అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం* 

 *శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।* 


 *#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం*


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: