19, సెప్టెంబర్ 2020, శనివారం

కులస్త్రీ

 


తల్లీ! ఇలారా తల్లీ! 


అమ్మ! 


నీ పెళ్ళి పట్టుమని పది రోజులు లేదు

నీతో సావదానముగా మాట్లాడే అవకాశం ఇప్పుడు దొరికింది. ఈ కాలం పిల్లలకు నేర్పాల్సినది ఏమీ లేదనుకో 

అయినా తల్లిగా నీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన భాధ్యత నాకుంది


అమ్మ! నలుగురితో సరదాగా గడిపేస్తున్నాను గాని నాకు విపరీతమైన ఆందోళనగా వుందమ్మ, కొత్త ప్రదేశములో ఇమడ గలనా? అమ్మ, నాన్న, ఇల్లు, స్నేహితులు, స్వేచ్ఛా ఫణంగా పెట్టి పెళ్ళి చేసుకోకపోతే వచ్చే నష్టమేమిటని అనిపిస్తున్నాదమ్మ! 


తల్లి! మానవాళి మనుగడకు, అభివ్రుద్దికి, వంశ పరంపరకు

స్త్రీ పాత్ర అత్యంత కీలకం. 

ప్రజాహితం కోరి

సర్వ భోగాలూ అనుభవిస్తున్న రారాజు వున్న ఫళంగా యుద్దరంగల్లో దూకక తప్పదు. 

సంపూర్ణ స్త్రీ కి వైవాహిక జీవితము తొలి మెట్టు, సంతానం మలి మెట్టు


నీ భర్త వంశాన్ని వుద్దరించడానికి వెళ్తున్నావు, కనుక నీ స్థానము సుస్దిరము, కాకపోతే ఓపిక, సహనం, నేర్పు, కార్యధక్షత, విచక్షణా 

జ్ఞానం తో తుఫానుల్లా ఎగసి పడుతున్న ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి


నీ సంసారములో కీలకం మీ అత్తగారు. ఆవిడ మనసును గెలుచుకోవడం నీ ప్రధమ విజయం

కనుక నువ్వు మీ అత్తవారింట్లో ఎంత transparency focus చేసేవు అన్నదాని మీదే నీ విజయ పరంపర ఆధారపడి వుంటుంది. 


ప్రస్తుతం మీ అత్తగారితో బందం బలపరచుకోవడము అతి ముఖ్యమైనది సుమా! 


నువు మీ అత్తగారితో మాట్లాడే ప్రతీ మాట సున్నితము, సరళము, అన్యోన్యత, గౌరవము, మాధుర్యము, ప్రతీ వాక్యానికి

ఆదిలోననూ ఆఖరునా "అత్తయ్యగారు" తప్పనిసరిగా వాడాలి 


మీ ఆయన దగ్గర మీ అత్తయ్య గారిని సపోర్ట్ చెయ్యి

మీ ఆయన ఏమి కొన్నా అత్తయ్యగారికేం తెచ్చారు? అని నిలదియ్యి


ప్రస్థుతం ఇవి చాలు


చివరిగా ఒకటి గుర్తు పెట్టుకో!

కోటి కోరికలతో ఆడపిల్ల అత్తవారింట్లో అడుగు పెడుతుందట


నా అనుభవం ఏమి చెపుతోందంటే:-

కోటి భాద్యతలతో అత్తవారింట్లో అడుగు పెడితే 

ముక్కోటి ఆశలు తీరుతాయి

శుభం! 

సుఖ సంసార జీవన ప్రాప్తిరస్తు

కామెంట్‌లు లేవు: