తిథి వార పక్షాలె తిరుగాడ వేవేగ
పరమాత్మ మహిమమ్మె యరసిచూడ
మాసవర్షాయన మాన్యచక్రమ్ములే
పర్వెత్త పరమాత్మ వరమెతలప
కనుచుండ బాల్య యౌవన వార్థకంబులె
కదలిపో పరమాత్మ కరుణగాదె
మనశక్తి మనదైన్యమను కర్మలన్నియు
మనమొంద పరమాత్మ ఘనతయెంచ
జీవుని జనన మరణంపు చేష్టలన్ని
పుణ్యపాపానువర్తులై పుడమిగలుగ
కాలరూపుడౌ పరమాత్మ లీలగాదె
అట్టి పురుషోత్తముని గొల్తు నాత్మయందు.
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి