**దశిక రాము**
**అడుగడుగున అద్బుతాలు…మహాబలేశ్వరం ఆలయాలు**.!!
మహాబలిపురం.. తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన పట్టణం. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దాల నడుమ దీన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో ఈ పట్టణం చక్కని పర్యాటక ప్రదేశంగా ఉండేది. ఇక్కడి రాతి ఆలయాలు, వాటిపై ఉండే శిల్పకళ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
చరిత్ర
7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
మరొక కథనం ప్రకారం అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనబడే ఓ రాక్షస రాజు పరిపాలించేవాడట. పేరుకు రాక్షస రాజే అయినా అతనిది చాలా జాలి గుండెనట. ఈ క్రమంలోనే అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు. దానికి అంతకుముందు మామళ్లపురం, కడల్‌మలై అనే పేర్లు కూడా ఉండేవట. కడల్‌మలై అంటే పర్వతాలు, సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం.ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. అందులోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది.
మహాబలిపురం మొత్తం 7 ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి. కానీ అందులో 2 ఆలయాలు సముద్రంలో మునిగిపోగా, ప్రస్తుతం 5 ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి. అవే మనకు కనిపిస్తాయి. అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడవచ్చు. అందుకు గాను బీచ్ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మనకు కనిపించే ఆ 5 ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాలలా ఉంటాయి. అవి పాండవులకు చెందిన 5 రథాలే అని చెబుతారు.
ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా 200 ఏళ్లు పట్టిందట. మొత్తం 3 తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట.
ఆ 5 ఆలయాల్లో సముద్రానికి దగ్గర్లో ఉన్న ఆలయం ముఖ్యమైందిగా చెబుతారు. దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాలు అన్నింటినీ కేవలం ఏకశిలతోనే నిర్మించారు.
ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరు శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణుని రాయి. దీనినే కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు. ఇది కృష్ణుడు ఆడుకున్న రాయి అని చెబుతారు. ఇది గుండ్రంగా ఉంటుంది. బల్లపరుపుగా ఉన్న మరో రాయిపై బ్యాలెన్స్ అయి ఉంటుంది. కిందకు దొర్లినట్లు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ దొర్లలేదు. అలాగే ఉంది. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మారింది.
ఈ రాయి ఎత్తు 20 అడుగులు కాగా వెడల్పు 5 మీటర్లు. బరువు 250 టన్నుల వరకు ఉంటుంది. అయితే ఈ రాయిని అక్కడకు తీసుకువచ్చి పెట్టారా.. అదే సహజసిద్ధంగా అక్కడ ఏర్పడిందా.. అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ సుమారుగా 1200 ఏళ్ల నుంచి ఆ భారీ రాయి అక్కడ అలాగే ఉంది. ఇది నిజంగా విశేషమే.
ఈ రాయిని తమిళంలో వానిరైకల్ అని పిలుస్తారు. అంటే స్టోన్ ఆఫ్ ది స్కై గాడ్ అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఒల్లాంటయ్‌టంబో, పెరు, మచ్చు పిచ్చులలో ఉన్న భారీ ఏకశిలలకన్నా ఈ రాయి చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది.
సైన్స్ ప్రకారం చూస్తే.. ఈ తరహా రాయిని అలా బ్యాలెన్స్ చేసి ఉంచడం చాలా కష్టం. ఈ రాయి ప్రస్తుతం కేవలం 4 అడుగుల ప్రదేశంలో బ్యాలెన్స్ చేయబడి ఉంది. అది కూడా కొండ లాంటి ప్రదేశంలో. అంతటి భారీ రాయి అంత తక్కువ ప్రదేశంలో ఎలా బ్యాలెన్స్‌గా ఉందా అని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా అలాంటి రాళ్లు కిందకు జారుతాయి. కానీ ఈ రాయి 1200 ఏళ్ల నుంచి అక్కడ అలాగే కదలకుండా ఉండడం.. నిజంగా ఆశ్చర్యమే మరి.
1908వ సంవత్సరంలో అప్పటి మద్రాస్ గవర్నర్ ఆర్థర్ లాలీ ఆ రాయిని చుట్టు పక్కల నివాసితులకు ప్రమాదకరంగా ఉందని భావించి దాన్ని అక్కడి నుంచి తొలగించాలని అనుకున్నాడు. కానీ ఆ రాయి అస్సలు కదలలేదు. అది అందరినీ షాక్‌కు గురి చేసింది.
ప్రఖ్యాత గాంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయిగా పేర్కొని, దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడు. కొందరు మాత్రం గుడి కోసం తెచ్చిన ఈ రాయిని మధ్యలోనే వదిలేసారని వాదిస్తారు. ఇంకొందరు ఇది గ్రహాంతవాసులు ఎగిరే పళ్లెం అని అంటారు
. దాదాపు 250 టన్నులు బరువు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు, అందుకే ఇది ఎలియన్స్‌కి సంబంధించింది అంటారు. ఈ రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవే ఎలియన్స్ తిరుగుతున్నారనే ఊహాగానాలు వెలువడే మెక్సికో, పెరూలు.
ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే టెక్నాలజీకి అబ్బురపకుండా ఉండలేరు. ఒకే చిత్రంలో ఆవు, పాలు తాగుతున్న దూడను చూడవచ్చు. ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా.. అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేసారనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.ఆ ఆలయంలోని గణేశుడి విగ్రహంపై రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది. దీంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి.
ఇక్కడ విచిత్రమైన మరో అంశం బావి. కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు. అప్పట్లోనే సాంకేతిక పరిఙ్ఞానం వాడారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని చూస్తే టెక్నాలజీ అబ్బురపరుస్తుంది. శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు,అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది. అచ్చం శాటిలైట్ స్థంభం మాదిరిగానే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తారు.
విమాన గోపురం చుట్టూ వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు. ఉపగ్రహ వాహక నౌకలు పంపినపుడు విడుదలయ్యే వాయువులు బయటకు పోయే విధంగా ద్వారాలను నిర్మించారు. కిటికీలు,తలుపులు కనపడకుండా రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ లైట్ హౌస్ దాదాపు 1000 ఏళ్ల కిందట నిర్మించారని భావిస్తారు.
మహాబలిపురంలో బీచ్‌కు దగ్గర్లో ఉన్న ఆలయానికి 1984లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి సమయంలో ఇక్కడ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. కథాకళి, భరతనాట్యం, కథక్, మోహినీ ఆట్టం, కూచిపూడి, ఒడిస్సీ తదితర భారతీయ నృత్యాలను కళాకారులు ప్రదర్శిస్తారు. ఈ ఫెస్టివల్‌ను తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది.
ఆలయం వద్ద చెక్క బడిన నందుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఆలయానికి సమీపంలో చెక్కబడిన శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వరాహ అవతార విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి