*దశిక రాము*
🕉️ శ్లోకం 01 🕉️
*విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః||*
*భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||*
1. విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము), సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు
2. విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).
3. వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు) ; అంతటినీ నియంత్రించి పాలించు వాడు.
4. భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.
5. భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).
6. భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.
7. భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.
8. భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.
9. భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.
భావము : ఈ సృష్టి అంతయు విష్ణువు చే వ్యాప్తి చెంది యున్నది. అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి యున్నవాడు. అతడే, జరిగినది, జరగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మ అయినవాడు. కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు.
ఓం నమో నారాయణాయ
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్ర భుః అంటూ పూజించే నారాయణుడు సర్వవ్యాపి. సమస్త జగత్తు నారాయణ స్వరూపమే.
‘నరము’ - అనగా ఆత్మ. ఆ ఆత్మయందు ఉత్పన్నమైన ఆకాశాదులు నారములన్నారు.
నారములు ఆయనముగా కలవాడు నారాయణుడు.
బ్రహ్మము, శివుడను, ఇంద్రుడును, కాలము, దిశలు-విదిశలునూ నారాయణుడే. నిష్కళంకుడు. నిరంజనుడు, నిర్వికల్పుడు, అనిర్వచనీయుడు, నిరాకారుడు, దేవాదిదేవుడు ఇలా ఎన్ని చెప్పినా నారాయణుడు ఇది అని చెప్పడానికి వీలులేనివాడు. అందుకే నారాయణుని నిర్వచించడానికి అక్షరాలు లేవంటారు.
నారాయణుడు తప్ప ఇతరమైనదేదీ ఈ లోకంలో లేదు.
ఆ నారాయణుని తెలుసుకున్నవాడే విశ్వవేత్త అంటుంది యజుర్వేదం. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షర మంత్ర మహిమను గూర్చి సామవేదం అద్భుతంగా వర్ణించి చెప్తున్నది.
నారాయణ మహామంత్రానే్న తిరుమంత్రమని అంటారు. నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపములను నశింపచేసే ఈ అష్టాక్షరీ మంత్రాన్ని సద్గురువుల వద్ద ఉపదేశం పొందాలంటుంది శాస్త్రం.
భవబంధాలను పారద్రోలే ఈ నారాయణ మంత్రం ప్రహ్లాదుని, జ్ఞాన, నామదేవ, తుకారాం, సక్కుబాయ, మీరాబాయ లాంటి ఎందరినో భాగవతోత్తములలుగా అందరిచేత స్మరింపచేసినట్లుగా మూగవాళ్లను మహా విద్వాంసులుగాను చేసింది. ఎంతోమంది గుడ్డివారు దృష్టిని పొందారు. పీడితులు, భయభీతులు, భయంకరమైన రోగాలచేత బాధపడేవారు కేవలం ఒక్కసారి నారాయణ నామ కీర్తనచేస్తే చాలు వారు సమస్త దుఃఖాలకు దూరమ వుతారు. సుఖాలను పొందుతారు ఈ విషయానే్న శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం చెబుతుంది.
సదా ధ్యానించవలసినవాడు కేవలం నారాయణుడే అని పద్మపురాణం చెబుతుండగా, నారాయణ నామం విన్నంతనే సమస్త దురితాలు దూరమవుతాయని వామన పురాణం అంటుంది.
‘నారాయణ’ ‘నా’ - అనే అక్షరం దేవుడు లేడనే బుద్ధిని తొలగిస్తుంది
. ‘రా’ - అనే అక్షరం భగవత్ప్రేమనూ, వైరాగ్యాన్నీ, రక్షణనూ కల్పిస్తుంది.
‘య’ - అనే అక్షరం యోగానుష్ఠానాన్ని పొందిస్తుంది.
అంతేకాదు యక్షరాక్షస భేతాళ భూతాదుల భయాన్ని పోగొడ్తుంది.
‘ణ’ - అనే అక్షరం భగవంతుణ్ణి వర్ణించే వాక్శుద్ధిని సిద్ధింపచేస్తుంది.
కనుక నారాయణ అన్న నాలుగక్షరాలు మానవజన్మను సార్థకం చేస్తాయ అనడంలో అతిశయోక్తి లేదు. నారాయణ మంత్రం జపించేచోటున ఈతిబాధలు, కరువుకాటకాలు ఉండవు. భూతలమే స్వర్గలోకంలా భాసిస్తుంది.
ఇంత ప్రభావమున్న శ్రీమన్నారాయణుని సదా స్మరించి, ఆ మంత్ర రాజమును సదా జపించి జన్మలను సార్థకం చేసుకోవాలి.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంస్కృతం నుండి తెలుగుకు అనువదిస్తూ చెప్పిన ఈ శతకం శ్రీ పిన్నెల్లి వెంకట రామ గోపీనాథ్ గారిచే రచించబడినది మొత్తం 216 ఆటవెలదుల తో రచించబడిన ఈ శతకము విష్ణు సహస్ర నామాలకు చక
్కని అచ్
చ తెలుగులో అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా
(ఆట వెలదులలో ....భావార్థాలతో...) రచించబడినది
1. విశ్వ వ్యాపకుండు, విశ్వమంత యతని
వశమునందె యుండు వదల కుండ
మూడు కాలములకు జూడ దానధిపతి
వందనాలు హరికి వంద వేలు !!
[అర్థాలు: విశ్వం ... చరాచర జగత్తు, విష్ణు ... అంతటా వ్యాపించి ఉన్నవాడు, వషట్కార ... వశమునందుంచుకున్నభూత భవ్య భవత్ప్రభు ... మూడు కాలాలకు అదిపతి.
భావము: విశ్వమంతటా వ్యాపించి దానిని తన అదుపులో ఉంచుకున్నవాడు, భూత, వర్తమాన, భవిష్యత్కాలాలు మూడింటికీ అధిపతియూ నైన ఆ స్రీహరికి శత సహస్ర వందనాలు.]
అన్ని భూతములకు నాత్మ తాను
కాంతి నిచ్చు మరియూ గల్పించు శుభములు
వందనాలు హరికి వంద వేలు !!
భావము: సమస్త చరాచర జగత్తుకు (సృష్టి)కర్తయై, తానుగా భరిస్తున్నవాడు, అన్నిటా సమభావం కలిగి, అన్నిటికీ వెలుగు, శుభములు కల్పిస్తున్నవాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.
*ఓం నమో నారాయణాయ*
*ధర్మో రక్షతి రక్షితః*
🙏🙏🙏
https://t.me/SANAATANA
*ధర్మో రక్షతి రక్షితః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి