24, జూన్ 2024, సోమవారం

నివేదన – పవిత్రత

 *నివేదన – పవిత్రత* 

 గురువుల సమక్షంలో   ఓ శిష్యుడి ఇంట్లో, సహస్రనామ పాదపూజ  జరుగుతున్నది. శ్రీ గురువుల ప్రక్కన టేబుల్ ఫ్యాన్ ఉంచబడింది. నైవేద్యం తీసుకువచ్చినప్పుడు, శ్రీ గురువులు పంకా (ఫ్యాన్) ను కొద్దిగా ప్రక్కకు త్రిప్పారు. శిష్యుడ్ని పేరు పెట్టి పిలుస్తూ అతని దృష్టిని ఆకర్షించిన శ్రీ గురువులు, “లలితా సహస్రనామంలోని పేర్లు  అతి రహస్యమైనవి, గూడార్థము కలిగినవి. ఉదాహరణకు, “అపర్ణ” పేరును పరిశీలించండి. హిమవంతుని కుమార్తె పార్వతిగా వ్యక్తమైన తరువాత, ఆ తల్లి శివుడిని పొందటానికి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ సమయంలో, ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా ఉపవాసం చేసింది. దీనిని గమనించిన దేవతలు ఒక్క ఆకు కూడా తినని ఆ తల్లిని  ‘అపర్ణ’ అని ప్రశంసించారు.ఆ పేరుకు మరో అర్ధం కూడా ఉంది. “అప” మరియు “ర్ణ” గా విభజించండి. అంటే  ఋణం నుండి విముక్తి పొందిన వ్యక్తి అని అర్ధం. ఎవరైనా ఆమె పేరును స్మరించినప్పుడు, ఆమె తన భక్తుడి నుండి ఏదో అందుకున్నట్లు అనిపిస్తుంది. క్షణాలు ఆలస్యం చేయకుండా, ఆమె ఆ భక్తునికి రుణం వుంచుకోకుండా తిరిగి చెల్లిస్తుంది.అలాగే, ఎవరైతే తన రుణాన్ని వెంటనే తీరుస్తారో ఆమెను  నిజంగా అపర్ణ అని అంటారు. ఆమె ఏదీ తన దగ్గర వుంచుకొనదు. నామముల అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుసుకున్నప్పుడు ఆరాధన యొక్క ఆనందం పెరుగుతుంది”. అని పూజ్య గురువులు శెలవిచ్చారు. అటు పిమ్మట శ్రీ గురువులు పూజను కొనసాగించమని శిష్యుడికి సైగ చేసి, ఫ్యాన్ ను యథాస్థితికి త్రిప్పారు. పూజ ముగిసిన తరువాత, శ్రీ గురు చరణులు అందరినీ ఆశీర్వదించి వెళ్లిపోయారు. 

తరువాత, శిష్యుడు జగద్గురువులు బస చేసిఉన్న  చోటుకు వెళ్ళాడు. భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ గురు చరణులను సమీపించి, *" నేను ఎంతో భాగ్యశాలిని, జగన్మాత యొక్క పవిత్ర నామం అయిన అపర్ణ యొక్క అర్ధాలను మీ ద్వారా విన్నందుకు నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను.   మీ పవిత్ర చరణముల ద్వారా ఉద్భవించిన ఈ కథ యొక్క రెండవ వ్యాఖ్యానం కూడా విని నేను ఎంతో ఆశ్చర్యపోయి, ప్రేరణ పొందాను.* 


HH: దాని కోసం నాకు గుర్తింపు, కీర్తిని ఇవ్వవద్దు. ఇందులో నా ప్రమేయం ఏమియూ లేదు. 

శిష్యుడు: మీరు  నిరాడంబరులు. 


H.H: ఇది నమ్రత గురించిన ప్రశ్న కాదు.  నేను ఇచ్చిన అర్ధాలు లలిత-సహస్రనామం శాస్త్ర వ్యాఖ్యానంలో ఉన్నాయి. 

శిష్యుడు: మీ పాద చరణాల నుండి నేను చాలా విలువైన  పాఠాలు నేర్చుకున్నాను. ఆరాధన సమయంలో జపించే నామం యొక్క అర్ధాన్ని, దాని ప్రాముఖ్యతను  తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా దాని అర్ధం కూడా తెలుసుకునే స్థితిలో ఉండాలి. 

ఫ్యాన్ యొక్క స్థానాలను మార్చడంలో  తమ అంతరార్ధాన్ని నాకు శ్రీచరణులు తర్వాత ఇలా చెప్పారు. *తెచ్చిన నైవేద్యం చాలా వేడిగా ఉందని, నేను దానిని దేవతకు అర్పించే ముందు, మేము పంకాను (fan) దాని వైపుకు త్రిప్పాము. అది చల్లబడిన తరువాత, మళ్లి   పంకాను (fan) యధా స్థానానికి పునరుద్ధరించాము. నివేదన  చల్లబడుతున్నప్పుడు,  ప్రవచిస్తూ తద్వారా ప్రజల దృష్టిని నైవేద్యం వైపు ఆకర్షింపబడకుండా మరలించాను.తద్వారా  వేడి నైవేద్యం  సమర్పణ నివారించడమే కాకుండా, చేసే ఆ తప్పు వలన మా వంశానికి ఎటువంటి అసౌకర్యం, కీడు జరగకుండా శ్రీ గురువులు మమ్ములను రక్షించినారు. గురు దేవుళ్ళ సాధారణ చర్యలు కూడా ఎంతో  బోధనాత్మకమై, భద్రతతో కూడుకున్నవిగా ఉంటాయి.

ప్రశంసలను విస్మరించి శ్రీ గురువులు ఇలా అనుగ్రహించారు, *"పూజలు చేసేటప్పుడు, మనం  దేవుని సన్నిధిలోనే ఉన్నాము,  ఒక చిత్రం ముందు కాదు అన్న స్పృహ, భావన అందరికీ వుండాలి. మనము వేడిగా వున్న  ఆహారాన్ని, చెడిపోయిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడము,  ఒక ముఖ్యమైన అతిథికి కూడా అలాంటి ఆహారాన్ని ఇవ్వము.  అలాగే భగవంతునికి కూడా అలాంటి సమర్పణను ఇవ్వకూడదు. అదేవిధంగా వాడిపోయిన పువ్వులను, వాసన లేని పువ్వులను పక్కన పెట్టాలి.  క్రొత్త వాటిని మాత్రమే పూజకు సమర్పించాలి".*


*-జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు*

కామెంట్‌లు లేవు: