24, జూన్ 2024, సోమవారం

శాసన సభ్యులు - సుపరిపాలన 8*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 8*


సభ్యులకు నమస్కారములు.


అధికార పక్షము మరియు ప్రతిపక్షము అను భేదము లేకుండా శాసన సభ్యులందరూ , తమ తమ నియోజక ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి, చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందవలసి ఉంటుంది. ఫిర్యాదుదారులతో, లబ్ధి దారులతో మాత్రమే గాకుండా నియోజక ప్రజలందరితో మర్యాదా మన్ననలతో  ప్రవర్తిస్తూ, వివరాలను సేకరిస్తూ, జాప్యం జరుగకుండా వేగవంతంగా స్పందిస్తూ ప్రజలకు సహకరిస్తూఉండాలి. 


ప్రతి శాసన సభ్యుడు తమ నియోజక ప్రజల మద్దతుతోనే తాము అధికారంలోకి వచ్చామన్న  భావన సర్వదా కలిగి ఉండాలి. పాలకులు బాధ్యతాయుతంగా అంకిత భావంతో క్రమశిక్షణాయుతంగా వారి వారి  విధులు నిర్వహించాలి. ముఖ్యంగా సమాజంలోనున్న సంఘ విద్రోహశక్తులను, నేరస్తులను, జూదగాళ్లను, మత్తు పదార్థ విక్రయ దారులను, మాన భంగ దుర్మార్గులను,  దౌర్జన్యకారులను ఇత్యాది చట్ట వ్యతిరేక, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించడంలో  రక్షకభట శాఖ సహకారము గైకొని  ప్రజలకు ప్రశాంతమైన వాతావరణము కల్పించాలి.  *నిజాయితీగా, ఋజు వర్తనతో ఉండే అధికారుల విధులలో జోక్యము చేసుకోరాదు* అట్టివారికి  అండదండలుగా  *ఉంటే ప్రజలు హర్షిస్తారు*.


*నేరస్తుల నియంత్రణలో   శాసన సభ్యులు ఎట్టి ప్రలోభాలకు గాని ఆధిష్టానము ఒత్తిడులకు గాని లోంగరాదు* . నేరాల అదుపునకై భద్రతా శాఖ సహకారముతో, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానము వినియోగించుకుంటూ  *శాంతి భద్రతల అంశమునకు ప్రథమ ప్రాధాన్యము ఇవ్వవలసి ఉంటుంది*. 

 

ఎన్నికల సమయంలో  తమ తమ పార్టీలు ఇచ్చిన ప్రజా సంక్షేమ  హామీలను మరియు వాగ్దానాలను అమలు చేయాలి, పూర్తిచేయాలి. ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, ప్రజలు స్వయం పోషకులుగా తమ శక్తి సామర్థ్యాలను వినియోగించుకునెలా ఉద్యోగ అవకాశాల కల్పపనలో, పారిశ్రామిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలి.  సంక్షేమము తో పాటు  అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వడం మరి మరీ ముఖ్యము.


*ప్రజల సుఖ సంతోషాలు మరియు క్షేమమే తమ కర్తవ్యంగా నాయకులు భావించాలి*.  ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పార్టీలు ఏవైనా సరే ప్రజా సంక్షేమ పథకాలన్నీ అమలు అయ్యేలా కృషి చేయాలి, దీక్షబూనాలి. *ప్రతి శాసన సభ్యుడు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి*.


ధన్యవాదములు.

(*స శేషం*)

కామెంట్‌లు లేవు: