6, జూన్ 2024, గురువారం

పంచ గ్రహ కూటమి

పంచగ్రహకూటమి. 

గ్రహకూటమి అంటే గ్రహాలూ ఒకేరాశిలో వుండటానికి గ్రహకూటమి అంటారు. ఇప్పుడు పంచగ్రహ కూటమి వచ్చింది అంటే ఒకే రాశిలోకి ఐదు గ్రహాలూ వచ్చి చేరాయి అన్నమాట. ప్రతి గ్రాహం దాని దాని వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి ఒకే రాశిలో కలుసుకొని వుంటాయో అప్పుడు వాటి ప్రభావం విశ్వము మీద పడుతుంది. అయితే కొందరు జ్యోతిస్కులు ఇప్పుడు ఏర్పడే పంచగ్రహ కూటమి అంత ప్రమాదకారి కాకపోవచ్చు అని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ. పంచగ్రహకూటమి దాని ప్రభావం తప్పకుండ చూపెడుతుంది. కానీ ఏ ఏ రాసులవారి మీద యెంత యెంత ప్రభావం కలిగి ఉంటుంది అనేది మాత్రం జ్యోతిష్య శాస్త్రజ్ఞులు మాత్రమే చెప్పగలరు.

ఆకాశంలో అద్భుతాలు జ‌రుగుతూ ఉంటాయి. అయితే ఒక్కో స‌మ‌యంలో ఒక్కో గ్ర‌హ స్థితి కాంబినేష‌న్ ఆకాశంలో ఏర్ప‌డుతూ ఉంటుంది. కొన్ని కాంబినేష‌న్ల వ‌ల్ల ప్ర‌కృతి విప‌త్తులు ఏర్ప‌డుతూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి లాభం కొన్ని రాశుల వారికి న‌ష్టం జ‌రుగుతూ ఉంటుంది. ఈ ఏడాది పంచ గ్ర‌హ కూట‌మి ఏర్ప‌డ‌బోతోంది. అంటే ఐదు గ్ర‌హాలు ఒకేసారి ఆకాశంలో ద‌ర్శ‌న‌మిస్తాయి.

కుజుడు, శుక్రుడు, గురువు, బుధుడు, సూర్య గ్ర‌హం క‌లిసి ఒకేసారి క‌నిపించ‌బోతున్నాయి. ఇది 13 ఏళ్ల త‌ర్వాత ఏర్ప‌డ‌బోతున్న కూట‌మి. ఈ పంచ గ్ర‌హ కూట‌మి అనేది మ‌న‌కు జూన్ 2 నుంచి జూన్ 14 వ‌ర‌కు క‌నిపిస్తుంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఆకాశంలో తూర్పు వైపున చూస్తే క‌నిపిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ గ్ర‌హ కూట‌మి వ‌ల్ కొన్ని రాసుల వారు  న‌ష్టాలు ఎదుర్కోబోతున్నరు.  మీ రాశికి ఈ పంచగ్రహకూటమి వల్ల  ఎటువంటి ముప్పు  వున్నది,దానికి ఎలాంటి పరిహారాలు చేయించాలి అనేది మీ జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకొని అనుసరించండి.  కేవలము పంచ గ్రహ కూటమికి సంబందించిన సమాచారం మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది.

కామెంట్‌లు లేవు: