10, డిసెంబర్ 2020, గురువారం

మణిపురం అనే నగరంలో ఒక రాజు ఉండేవాడు

 మణిపురం అనే నగరంలో ఒక రాజు ఉండేవాడు. అతని ధర్మపత్ని పతివ్రత. ప్రభుభక్తి పరాయణ. ఆమె ఒకసారి తన మెడలోని అత్యంత విలువైన అందాల హారాన్ని తీసి గట్టు మీద పెట్టి స్నానం చేయసాగింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద యొక్క ద్రుష్టి ఆ ఆభరణం మీద పడింది. పడగానే హారాన్ని ఆ గ్రద్ద తన్నుకొని పోయింది. ఆది ఆకాశంలో ఒక పేద ముదుసలి గుడిసె మీదుగా వెళ్తూ ఆ గుడిసె కప్పు మీద చచ్చిన పాము నొకదానిని చూసింది. చూసినదే తడవుగా ఆ గ్రద్ద ఆ హారాన్ని అక్కడ విడిచి పామును నోట కరుచుకొని పోయింది.

          కొంతసేపటికి రాజాంతహపురము చేరిన రాజుగారికి రాణిహారం పోయిన విషయం తెలిసింది. రాణికి ఆ హారాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తానని రాజు నచ్చజెప్పాడు. వెంటనే కొలువు చేరి జరిగిన కథనంతా సభాసదులకు విన్నవించారు. రాణిగారి హారాన్ని తిరిగి తెచ్చి అప్పజెప్పినవారికి కోరిన బహుమానం ఇవ్వబడుతుందని నగరమంతా చాటింపు వేయించేడు. మరుసటి రోజు నే ఒక వ్రుద్దురాలు ఒక హారాన్ని తీసుకుని రాజాస్థానానికి వచ్చింది. ఆ హారాన్ని రాజుకు సమర్పించింది. రాజు మిక్కిలి సంతసించి ఆ అవ్వను "వరం కోరకో" అన్నాడు. అప్పుడు ఆమె మహారాజా! ఈ రోజు మొదలు ఎనిమిదవరోజు వరకూ ఈ నగరంలో ఎవరూ మహాలక్ష్మి పూజచేయరాదు. ఆ పూజను కేవలం నేనే జరిపిస్తాను. ఈ పూజకు కావలసిన తైలము, పూజాసామాగ్రి నా ఇంటికి పంపించండి అని కోరింద.

         రాజు ఆశ్చర్యచకితుడై ఆ అవ్వను ఇలా ప్రశ్నించాడు. ఈ బహుమానం వలన నీ కొరిగేదేమిటి? వ్రుద్దురాలు ఆ ప్రశ్నకు బదులుగా "రాజా! ఈరోజు న లక్ష్మీ పూజ, దీపావళి పండుగ చేసినట్లు అయితే మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. వారి ఇంట్లో లక్ష్మి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. రాజు మరింత సంతసించి నాకూ లక్ష్మీ పూజ చేయాలని ఉంది అన్నాడు. అంత అవ్వ మొదట నా పూజ జరగనీ తదుపరి నీ పూజ చేతువుగాని అంది. ఈ విధంగా వారిరువురి పూజతో లక్ష్మీదేవి ప్రసన్నురాలై వారి ఇంట లెక్కలేనంత ధనసమ్రుద్ధి ఏర్పడింది. లక్ష్మీనివాసంగా వారి ఇళ్ళు కళ కళ లాడాయి.

       కాబట్టి ధర్మరాజా! లక్ష్మీ ప్రసన్నం కోసం రాజప్రాసాదాల నుండి పూరిగుడిసెలవరకూ ఈ రోజుల్లో లక్ష్మీ పూజ జరుపబడుతూ వస్తోంది.

కామెంట్‌లు లేవు: