10, డిసెంబర్ 2020, గురువారం

25 నుంచి కొవిడ్‌ టీకా

 *_💉25 నుంచి కొవిడ్‌ టీకా!_*


*_ప్రారంభించనున్న ప్రధాని మోదీ_*


*_జనవరి 15 నాటికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు!_*


*హైదరాబాద్‌: భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. యూకేలో మంగళవారం మొదలైన టీకా పండుగ.. మనదేశంలోనూ డిసెంబరు 25న (ఆ రోజు వాజ్‌పేయి జయంతి) మొదలు కాబోతోంది!! ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ తెలియజేసింది. తొలిదశ టీకా కార్యక్రమంలో భాగంగా.. కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి జనవరి 15 నాటికల్లా వ్యాక్సిన్‌ అందించేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొవిడ్‌ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాల అధికారులకు ఈ భేటీలో సూచించింది. టీకాలు ఎలా అందించాలనే విషయాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది.*


*వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) పరిధిలోని కొవిడ్‌-19 విషయ నిపుణుల కమిటీ ఈ మూడు విజ్ఞప్తులను బుధవారం పరిశీలించనుంది. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నామని.. వీలైనంత త్వరలోనే ఆ మూడిటిపై లేదా వాటిలో ఏదో ఒకదానిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. తొలి దశ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గుర్తించిన వైద్య సిబ్బంది వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. తొలి దశలో మూడు కోట్ల డోసుల టీకాను నిల్వచేసేందుకు ప్రస్తుతం ఉన్న శీతల గిడ్డంగులు సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు.*

కామెంట్‌లు లేవు: