🍃🌺మనిషికి కోరికలు అనంతం..జీవితం నీటి బుడగ వంటిదని తెలిసీ కలకాలం బతకాలనుకొంటాడు.. నిరంతరం సుఖాల్లో తేలియాడాలని తపిస్తాడు..తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు..భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్థంతో పూజిస్తాడు..
భగవంతుడు దయామయుడు..అందరి ప్రార్థనలు వింటాడు.. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు..
నిస్వార్థంగా భగవంతుని నమ్ముకున్నవారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు..
‘భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి..తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది.. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు.. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు’ అన్న రమణ మహర్షి బోధను అర్థం చేసుకున్నవారికి- భగవంతుణ్ని కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది..
తృప్తిని మించిన సంపద లేదు..అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి జీవితమంతా ముళ్లబాటే.. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం వెన్నంటే ఉంటుంది..
*శుభోదయం*
🌳🌳🌳🌳🌳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి