4, సెప్టెంబర్ 2021, శనివారం

మంచి అలవాటు/Good Habits

 మంచి అలవాట్లు /Good Habits

మనం నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యవంతులుగా సంతోషంగా, ఆనందంగా ఉండటానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముందు జాగ్రత్త తరువాతి ఆపదలను నివారిస్తుంది. 

 1. ప్రతిరోజు ఉదయం 5గంటలకి లేవాలి.( సూర్యోదయానికన్నా నిద్ర లేవటం వలన ఉషారుగా వుంటారు) 

2.ఉదయం పలహారానికి ముందు ఒక లీటరు నీరు త్రాగాలి.( ఉదయం త్రాగే నీటి వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది, రక్తంలో నీటి శాతం పెరిగి చురుకుగా వుంటారు. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది) 

3.ఆహారం తినేముందు కాళ్ళు,  చేతులను శుభ్రంగా కడగాలి (పరిశుభ్రత పాటిస్తే సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి రావు 

4.ఉదయంపూట పెరుగు అన్నం, గంజి అన్నం, ఇడ్లీ, దోస లేదా పెసరెట్టు మొదలగునవి తినాలి. 

5. రోజుకు 4నుంచి 6నానబెట్టిన బాదం పప్పు తినాలి. 

6.ఉదయం 6 నుంచి 8,సాయంత్రం 4నుంచి 6గంటల సమయములో ఎండ శరీరానికి తగలాలి ( ప్రాతః కాలపు సూర్య రశ్మిలో మన శరీరంలో Vit-D తయారు అయ్యే వ్యవస్త పనిచేస్తుంది) 

7.ఆకుకూరలు, కూరగాయలు,పప్పు,దంపుడు బియ్యం పెరుగులాంటివి మన ఆహారంలో తీసుకోవాలి ( విటమినులు సరియిన మోతాదులో లభించి కావలసినంత రోగ నిరోధత వృద్ధి చెందుతుంది) 

8.ప్రతిరోజు కాకరకాయ కూర లేదా వేప ఆకులు తింటూ ఉండాలి 

9.రోజు ఒక పండు తినాలి(అవి అరటి,ఆరంజ్, జామ,మామిడిపండు మొదలగునవి)

10. రాత్రి బోజనం 7గంటలలోపు తినాలి. 11. రాత్రి 10గంటలకి బ్రష్ చేసి పడుకోవాలి.

12.తలస్నానం ప్రతిరోజు చేయాలి(షీకకాయ షాంపుని వారానికి 2సార్లు ఉపయోగించాలి

13. రోజుకు 01గ్లాసు నిమ్మరసం త్రాగాలి.

 14.రోజుకు 10నుంచి 12 గ్లాసుల.నీరు త్రాగాలి.  

15.వంటకి నువ్వులనూనె, వేరుశనగనూనె గాని ఉపయోగించాలి. 

16. రోజుకు 01 గ్లాసు పాలు త్రాగాలి

 17. రోజుకు 01 గ్లాసు అంబలి త్రాగాలి.

18. కొబ్బరి నీరు, మజ్జిగ లాంటివి సేవిస్తూ ఉండాలి.

 19. డికాషను గాని, కాఫీగాని త్రాగాలి.

 20. మూడునెలలకు ఒకసారి కానీ లేక్ కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆముదము సేవించాలి.  దీనిద్వారా జీర్ణాశయం శుద్ధి అవుతుంది 

21.సున్నుండలు,పప్పు చెక్కలు,నువ్వుల ఉండలు మొదలగునవి తింటూ వుండాలి.(వీటిలో ప్రోటీనులు సంవృద్ధిగా వుంది శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి) 

23. పంచదారకి బదులు బెల్లం వాడుతుండాలి. 

22.రోజుకు 01చెంచా తేనె సేవించాలి.

24. కుండలో నీరుగాని రాగి, ఇత్తడి పాత్రలలో నీరుగాని త్రాగుతు వుండాలి

. 25. ప్రతిరోజు 1/2 టీ స్పూను నెయ్యి అన్నంతో తినాలి.

26. వారానికి ఒకసారి శరీరానికి నూనె పట్టించి ఆరిన తరువాత నలుగు పెట్టాలి. 

27. ప్రతిరోజు ఒక కప్పు మొలకెత్తిన గింజలు తినాలి. 

28. అప్పుడప్పుడు వంటలలో పచ్చి కొబ్బరి వాడాలి.

 29. ప్రతిరోజు కనీసం అరగంటవ్యాయామం (నడక,జాగింగ్,యోగాసనాలు) చేయవలెను.

30. బాండ పచ్చళ్ళు ఇనపముకుడులో వేయించటం, తాలింపు చేయటం చేయాలి ( ఆ పచ్చళ్లలో ఇనుము కొద్దిగా కరిగి మన శరీరంలో హిమోగ్లోబిన్ వృద్ధి చెందటానికి సహకరిస్తుంది తత్వారా అనీమియా రాకుండ కాపాడుతుంది.) 

31. అనవసరంగా ఎవరిమీద కోపగించవద్దు. ( కోపం వలన నరాలు ఉద్రేకానికి లోనయి రక్త పీడనాన్ని పెంచుతాయి తత్వారా అనేక రుగ్మతలు కలుగ వచ్చు) మౌనశ్చ కలహం నాస్తి. 

33) రోజులో ఎక్కువ భాగం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. 

34) గతాన్ని ఎప్పుడు తలుచుకోకండి గతంలోని సంతోషాలను, ఆనందాలను మాత్రమే తలుచుకొని మళ్ళి సంతోషపడండి. 

35. ఇతరులతో ప్రేమగా ప్రవర్తించండి. ఎవరైనా మిమ్మలిని చులకన చేసిన పట్టించుకోకండి.  వారితో తక్కువగా వ్యవహరించండి. 

36. అనవసరంగా ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి.  ప్రపంచంలో ఎవ్వరు మీ ప్రతిభను గుర్తించాలని అనుకోకండి. 

37. నీ సాటి వాడు అభివృద్ధి చెందాడని ఈర్ష్య పడకండి.  దేముడు ఎవరికి ఏది ఇవ్వాలో వారికి అది ఇస్తాడు. 

38) రోజులో కొంత సమయం దైవ సంబందితి కార్యక్రమాలు అంటే పూజలు, జపాలు, నామ స్మరణం మొదలైనవి చేసి మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లు చేసుకోండి. 

39) భగవత్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మా చెప్పినట్లు మీ ధర్మం ఏమిటో తెలుసుకొని దానిని మాత్రమే ఆచరించాలి.  ఎట్టి పరిస్థితిలోను నీ ధర్మం కానిదానిని ఆచరించవద్దు. 

40) వేదవిహిత కర్మలు అంటే మంచి పనులు మాత్రమే చేయాలి.  నిషిద్ద కర్మలు ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. 

41) దైవ దూషణ ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. 

42) సాధ్యమైనంత వరకు సత్యాన్ని పలకాలి 

43) ఇతరులకు హాని కలిగించే పనులు అస్సలు చేయకూడదు. 

44) అన్యాయ ఆర్జన కోసం ప్రయత్నించకూడదు. 

45) చిన్న చిన్న అనారోగ్యాలకు ఇంట్లోని చిట్కాలను వాడితే మంచిది. 

46) అనవసరంగా అంటిబొయితికులు వాడకూడదు. 

47) పూర్తి కడుపునిండ తినకుండ కొంత వెలితిగా శ్రీ కృష్ణ భగవానులు గీతలో తెలిపినట్లు తినాలి. 

48) రోజు సమయానికి భోజనము, నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. 

49) దానం పోయిన పరవాలేదు కానీ ఆరోగ్యం పాడు కాకూడదని భావించాలి. 

50) క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరచుకోవాలి. 

 గమనికః ఈ ప్రతిని తీసుకొన్నవారు కనీసం 10 కాపీలు తీసి 10మందికి పంచగలరు





కామెంట్‌లు లేవు: