4, సెప్టెంబర్ 2021, శనివారం

గంగు మెహతార్

 " గంగు మెహతార్ " 

 మరాఠా సైన్యంలో ఒక ప్లటూన్ కు నాయకత్వం వహించిన ధీశాలి..

తనమీద ఒకేసారి దాడి చేసిన రెండు పులులను చురకత్తితో చంపేసిన మహావీరుడు..

భరతమాత ను తన తల్లిగా ఆరాధించిన ప్రఖర దేశభక్తుడు..తన సాటి సైనికులతో ..

"ఈ నేల మన మాతృభూమి.. మన తల్లి..మన తల్లిని స్వేచ్ఛగా ఉంచడానికి మన పూర్వీకులు చేసిన త్యాగం గుర్తు తెచ్చుకోండి ..ఈ తల్లి మళ్ళీ దాస్యశృంఖల అయింది తిరిగి మన తల్లికి స్వేచ్ఛను ఇవ్వాల్సిన బాధ్యత మనదే.. ఏదో ఒకరోజు నా మాతృభూమి శృంఖలాలు తెంచుకొని స్వేచ్ఛ అనుభవిస్తుంది " అని చెప్పేవారు.. 

1857 స్వాతంత్య్ర సంగ్రామంలో, గంగు మెహతార్ 150 మంది బ్రిటిషర్లను చంపాడు. బ్రిటిష్ దుర్మార్గులు ఆయనను అరెస్టు చేసి, చున్నిగంజ్‌లోని వేప చెట్టుకు ఉరితీశారు..

బ్రిటిష్ ప్రభుత్వం మనలోని అనేక స్వాతంత్ర సమరయోధులు, ధార్మిక యోధులు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మరియు బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎన్నడూ గుర్తించని వారిని దొంగలు..దోపిడీదారులుగా ముద్రవేసింది.. స్వతంత్ర భారతదేశంలో నేడు 300 కు పైగా కులాలు/తెగలను బ్రిటిష్ వారు అప్పుడు వేసిన ముద్రనుంచి నేటికీ బయటపడలేకపోతున్నారు..

ఉదాహరణకు స్టూవర్ట్ పురం .. అలాగే భద్రాద్రి గుత్తికోయలు .. వీరినందరిని పుట్టుకతోటే దొంగలు నేరస్తులుగా బ్రిటిష్ ప్రభుత్వం దుర్మార్గమైన ముద్రవేసింది... అలాగే గంగు మెహతర్‌పై కూడా ఒక నకిలీ కథను సృష్టించారు..దానిద్వారా ఆయన కులాన్ని ఆయన్ను ఒక నేరచరిత్ర గల వర్గంగా ముద్ర వేసి ఆయన్ను హంతకుడు దోపిడీదారుగా వాళ్ళ రికార్డుల్లో రాసుకున్నారు.. దీనివలన ప్రభుత్వ రికార్డులలో ఆయన ఎల్లప్పుడూ ఎక్కువ మంది బ్రిటిషర్లను చంపిన నేరస్థుడిగా ఉంటాడు.

ఈ చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉన్నది..అలాగే కొన్ని కులాల మీద వేసిన ముద్ర కూడా అధికార రికార్డులనుంచి తొలగించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది..

ఇలాంటి మహావీరులు చెట్లకు తమ దేహాలను వేలాడతీసినందువలన మనకు స్వతంత్రం వచ్చింది..

ప్రయోగాల పేరుతో వయసులో ఉన్న మహిళల దేహాలకు హత్తుకొని ఆ వేడిని అనుభవించిన వ్యక్తుల వలన స్వతంత్రం రాలేదు..

మహావీరులకు ఇవ్వాల్సిన గౌరవం వారికిద్దాం..వారి త్యాగాలను గుర్తిద్దాం..

నేడు గంగు మెహతార్ జీ పుణ్యతిది..

భారత్ మాతాకీ జై..

కామెంట్‌లు లేవు: