*దుష్టుడి సహాయం దుఃఖాలకు మూలకారణం*.
*ఆపత్కాలంలో (కష్టకాలంలో) కూడా ఆశ్ర యించ కూడని వారు.*
1:- *షండుడు*:- సకాలంలో స్నానం చేయని వాడు, దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.
2:- *మార్జానుడు*:- అహంకారం తోను, నిర్లక్ష్యం తోను, జప, తపాలు చేసేవాడు.
3:- *అఖువు*:- కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక, ఇతరులకు పెట్టని వాడు.
4:- *కుక్కుటుడు*:- పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.
5:- *పతితుడు*:- తన ధర్మం విడిచి పరధర్మం ఆచరించేవాడు.
6:- *అపవిద్దుడు*:- గో హత్య,స్త్రీ హత్య మొ:లగు పాతకాలు చేసే వాడు.
7:- *నగ్నుడు*:- దైవ భక్తి లేనివాడు.
8:- *ఛండాలుడు*:- ఎంతో ఆశతో వచ్చిన వానికి,తాను సహా యపడక, ఇతరులు కూడా సహాయం చయకుండా అడ్డుపడే వాడు, మరియూ శరణు కోరి వచ్చేవానిని గాలికి వదిలేసేవాడు.
9:- *అధముడు*:- బంధువులు, స్నేహితులు, ఉత్తములు మొదలగువారికి దూరమైనవాడు.
ఇలాంటి వారిని, ఎంత కష్టదశలో ఉన్నా వా
ఆశ్రయించరాదని, విజ్ఞులైన మనపెద్దలచే చెప్పబడింది.
*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి