2, మార్చి 2023, గురువారం

మీరు అదృష్ట వంతులే

 *మీ నాన్న గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్ట వంతులే.కొంతమంది కోట్లు సంపాదిస్తారు.వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా?*


*మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*


*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*


*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారి‌మొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*


*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*


*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*


*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*


*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*


*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*


*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*


*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*


*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడు‌మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*


*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*


*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*


*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*


*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*


*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*


*లక్షాధికారైన లవణమన్నమె గాని*


*మెండుబంగారంబు మింగబోడు.*


*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*


*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*


*లోచర్ల సాయిదివాకర్ గౌరీప్రసాద్*🙏🙏🙏💐🙏🙏🙏

కామెంట్‌లు లేవు: