" సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! " ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ! ప్రకృతి ప్రసాదించెడి సన్మైత్రీ భావనాత్మక జీవన బాటకు అవరోధాలేల ! సృష్టి కర్త బ్రహ్మ ఒసగిన దివ్యమైన సుప్రకాశాత్మక బ్రతుకులో సుడిగుండాలేల ! సకల జీవ సురక్షాత్మక, సుసంక్షేమాత్మక నిత్య జీవన పథం ! విశ్వ మానవాళి తమ కనీస బాధ్యత నిర్వహించడంలో విఫలులవడం బహు శోచనీయం ! నేడు విశ్వ వ్యాప్త స్థితిగతులను పరికిస్తే, అవగతం అవుతున్న తీరు లోలోతులలో నిశితమైన విధాన బహు రీతుల ఆలోచనీయం ! మానవులలో కనీస మానవతా దృక్పథం కరవవుతున్న నేటి విశ్వ చక్రభ్రమణంలో, ఏమి జరుగుతుందో పూర్తి అయోమయావస్థ ! ఈ దశలోనే మానవాళి తగు రీతిలో యోచించాల్సిన ఆవశ్యకత బహు కీలకం ! భగవంతుని సృష్టిలో మానవాళి పాత్ర ఎంతో ఉన్నతం, మహత్తరం ! సకల జీవ పరిరక్షణలో వారి నిత్య కర్తవ్యం, విశ్వ సురక్షాత్మక నిత్య నడవడికలో విశ్వ మానవాళి సృష్టి, విశ్వ ప్రశాంత జీవన సంకేతం ! భగవత్కల్పితమైన తమ జీవన పయనంలో, సకల చరాచర జీవ జగతికి నిత్య సత్య సుహృద్భావ స్ఫూర్తి కల్పించడమే తమ బాధ్యతగా గుర్తెరిగి మసలాల్సిన సమయమిది ! " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! " ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ! రచన:
గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి