2, మార్చి 2023, గురువారం

శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయం

 విశాఖపట్నం జిల్లా : పెద్దవాల్తేరు

⚜ శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయం


💠 సాధారణంగా సముద్రంలో జాలర్లు 'వల' విసిరినప్పుడు దేవతా విగ్రహాలు ఆ వలలో పడటమనేది జానపద కథల్లో వింటూ ఉంటాము. కానీ నిజంగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం, చేపల వేటకి సముద్రంలోకి వెళ్లిన ఇక్కడి జాలరులు 'వల' విసరగా అందులో దుర్గాదేవి మూర్తి పడింది. 

అమ్మవారి మహిమగా భావించిన జాలరులు ఆ ప్రతిమను తీసుకువచ్చి తాత్కాలికంగా ఒక 'కరకచెట్టు' క్రింద ఉంచారు.

ఆ తరువాత భక్తుల సంకల్పంతో అమ్మవారికి ఆలయం నిర్మించబడింది. ఈ అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి వర్షాలు బాగా కురవడం .. పొలాలు కళకళలాడుతూ ఉండటం జరుగుతోంది. ఆరంభంలో కరకచెట్టు క్రింద ఉండటం వలన .. పొలాలు పచ్చగా వుంచుతున్నందు వలన ఈ అమ్మవారిని 'కరకచెట్టు పోలమాంబ'గా భక్తులు పూజిస్తుంటారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.


💠 విశాఖలో ‘వాల్తేరు’ ...ఈ పేరు  వినగానే ఉత్తరాంధ్ర వాసులందరికీ శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం గుర్తొస్తుంది. విశాఖపట్నం సమీపంలోని పెద్ద వాల్తేరు సమీపంలో ఉన్న ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.


💠 విశాఖ నగర తీరాన కొందరు దేవతలు కొలువై ఉన్నారు. వీరిలో ఎరుకమాంబ, శ్యామలాంబ, పోలమాంబ, కుంచమాంబ, ముత్యామాంబ, నూకలమ్మ, ఎర్నిమాంబ, నుత్యమాంబ, నీలమ్మ పేర్లతో ఉండే ఈ గ్రామ దేవతలందరూ విశాఖపట్నాన్ని కంటికి రెప్పలా కాపాడతారని అక్కడి ప్రజలు నమ్ముతారు. 

ఈ గ్రామ దేవతల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక చరిత్ర ఉంది. 

ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని వాల్తేరు శ్రీ కరకచెట్టు పోలామాంబ అమ్మవారి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం...


💠 గతంలో అమ్మవారిని జీడిపళ్ల అమ్మవారు అని పిలిచేవారు. ఎందుకంటే పండుగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్లు విసిరేసేవారట. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి శిరస్సుపై సర్పం, చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరణి, నిమ్మకాయల దండ అలంకరణతో మనకు దర్శనమిస్తారు. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తిని మూడింటిని ఏక కాలంలో ప్రసాదించే అమ్మవారే పోలామాంబ అని స్థానికులు నమ్ముతారు. 

ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటలు రావడంలో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలామాంబ అనే పేరొచ్చింది.


💠 శ్రీ పోలమాంబ అమ్మవారు అక్కడ కొలువు దీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మవారిని జీడిపళ్ల అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత పేర్లతోనూ పిలుస్తారు. 

ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం చుట్టూ పక్కల ఉన్న 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవం. 


💠 పిలిస్తే పలికే దైవంగా.. తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్ప దేవతగా, శశ్య దేవతగా భక్తులు కొలుస్తారు. 

ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివస్తారు. 

ప్రతి సంవత్సరం ఉగాది, శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.


🔅 చరిత్ర 🔅


💠 ఈ అమ్మవారు సుమారు 900 సంవత్సరాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలర్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్టించి కొలుస్తుండగా.. ఒకరోజు జాలర్లకు అమ్మవారు కలలో కనిపించి, తనను పెద్ద వాల్తేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించాలని ఆదేశించిందట. దీంతో వారు వెళ్లి అక్కడ అప్పగించారు. 

ఆ తర్వాత మద్ది వంశం వారికి కూడా కలలో కనిపించి తనను పెద్ద వాల్తేరులోని కరకచెట్టు కింద ప్రతిష్టించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్టించి పోలమాంబ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటినుంచి ఈ అమ్మవారు కరకచెట్టు పోలమాంబగా ప్రసిద్ధి చెందారు.


💠 గర్భాలయంలో, ఆలయంలో మూడు విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. మొదటిది లక్ష్మీదేవి యొక్క స్వరూపం అయిన కుంచమాంబ, రెండవది దుర్గాదేవి యొక్క స్వరూపం అయిన పోలమాంబ. మరియు మూడవది సరస్వతీ దేవి యొక్క అభివ్యక్తి అయిన నీలమాంబ దేవి.


💠 అమ్మవారికి రెండు వైపులా కుంచెమాంబ, నీలమాంబ అమ్మవార్లు కొలువు దీరి ఉంటారు. ఇక్కడ ఉండే ఉప ఆలయాల్లో నేస్తాలమ్మ, బంగారమ్మ, ముత్యమ్మ, సత్యెమ్మ, పిడుగులమ్మతో పాటు ఇంకా ఇతర దేవతలను మనం చూడొచ్చు. 


💠 ఇక్కడ 2 వేపచెట్టులు ఇదే గట్టుపై ఉండేవని, ఆలయంలో ఒక వేపచెట్టు ఎండిపోయి ఉండగా దాన్ని బొర్రకు ఒక పశువుల కాపరి ఎండిపోయింది కదా అని అగ్గి పెట్టగా అతన్ని అమ్మవారు సర్ప రూపంలో వచ్చి కాటువేసిన వైనాన్ని పూర్వికులు, చెపుకోవడంతో అమ్మవారి ప్రాబల్యం మరింత తెలిసింది. 

మిగిలిన ఒక వేప చెట్టు ఈనాటికి సజీవంగా శ్రీ పోలమాంబ పుట్టబంగారాన్నీ తోలేళ్ళు రోజున తీసుకొచ్చి అమ్మవారి ఉత్సవాలు జరపటం నేటికీ ఆనవాయితీగా వస్తుంది.


💠 కేవలం పది రోజుల వ్యవధిలోనే అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్న ఘనత ఆ పోలమాంబ అమ్మవారిదే.


💠 ఉగాది తర్వాత ఆదివారం నుంచి 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయి.


💠 విశాఖ రైల్వేస్టేషన్ నుంచి  4 కిమీ దూరంలో ఉంది.


 





కామెంట్‌లు లేవు: