22, జులై 2022, శుక్రవారం

సత్యం వద ధర్మం చర*

 శ్లోకం:☝️

*సత్యం వద ధర్మం చర*

*స్వాధ్యాయా న్మా ప్రమదః*

*ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య*

*ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీః*

*సత్యా న్న ప్రమదితవ్యం*

*ధర్మా న్న ప్రమదితవ్యం*

*కుశలా న్న ప్రమదితవ్యం*

*భూత్యై న ప్రమదితవ్యం*

*స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం*

*దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం*

    - తైత్తిరీయారణ్యకము


భావం: సత్యము పలుకుము, ధర్మము ననుష్ఠించుము. స్వాధ్యాయ విషయుములో ప్రమాదమును (ఏమరుపాటును) పొందకుము; అంటే అశ్రద్ధ వహించకుము. గురువునకు ప్రియమగునట్లు ధనమార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్సంతానమును బడయుము.

సత్యము నేమరకుము.

ధర్మమార్గమునుండి వైదొలగకుము.

కుశలము నుండి, కల్యాణకర్మలనుండి, సమృద్ధినుండి, స్వాధ్యాయప్రవచనములనుండి ప్రమాదము నొందకుము.

దేవ పితృకర్మలను విడువకుము.

కామెంట్‌లు లేవు: