శ్రీకాళహస్తీశ్వరమ్
శివ ! శివా! యని నిత్య చేతనోల్లాసాన
బ్రతికెడు నీ ప్రియ భక్తునకును
కాఠిన్య వజ్రమ్ము కడు సౌకుమార్యమౌ
భువన మనోహర పుష్ప మగును
అత్యంత వేడిమి నందించు ననలమ్ము
మహిత శీతలమైన మంచు యగును
నిండు జలంబుల నీరధి వెనువెంట
వాసయోగ్యమైన వసుధ యగును
సతత శత్రుత్వాన సాధించు వైరియు
మించిన ప్రేమతో మిత్రు డగును
కడు భయంకరమైన కాలకూటవిషమ్ము
భువి రుచ్యమైనట్టి భోజ్య మగును
నీదు నామామృతము జూడ నిక్కమరయ
సర్వమును వశ్యపరచును జగతి యందు
భక్త పరిపాల శంకరా ! భవ విదూర !
రమ్య శ్రీ కాళహాస్తీశ్వరా ! నమోస్తు .
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి