26, నవంబర్ 2020, గురువారం

శ్రీలక్ష్మి గణపతి స్వామి వారి ఆలయం

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳 స్వయంభూ శ్రీలక్ష్మి గణపతి స్వామి వారి ఆలయం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ నుంచి రాజమండ్రి కెనాల్ రూట్ లో అనపర్తి కి 10కి.మీ.సామర్లకోటకు 15కి.మీ దూరం లో కలదు. ద్రాక్షారామం కు 20కి.మీ.దూరంలో కలదు. అలాగే రాజమండ్రి కి40కి. మీ దూరంలో బిక్కవోలు గ్రామంలో కలదు. ఈ ఆలయం ఉదయం 6గంటలనుండి మధ్యాహ్నం 12.30నిముషముల వరకూ, సాయంత్రం 4 గం. ల నుంచి రాత్రి 8గం.ల వరకూ తెరిచి ఉంటుంది.

              ఈ ఆలయ చరిత్ర 1100సంవత్సరాల చరిత్ర ఉన్న తూర్పు చాళుక్యరాజులచే ఆరాధించబడిన స్వయం భూ విఘ్నేశ్వరుని అద్భుతమైన క్చేత్రం. కోరిన కోర్కెలు తీర్చే వినాయకుడు. ఈ బిక్కవోలు ఒకప్పుడు బిరుదాంకినవోలు. తూర్పు చాళుక్యరాజుల పరిపాలనా కాలంలో 849-892మధ్య బిక్కవోలు రాజధానిగా పరిపాలించబడి పలుదేవాలయాలు నిర్మించారు. ప్రపధమంగా క్రీ. శ. 9వ శతాబ్దంలో తూర్పు దిశగా స్వయం భూ శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించినారు. ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద శిలావిగ్రహంగా భాసిల్లతున్నది. భూమిలోపలికి ఎన్ని అడుగుల వరకు ఉన్నదో ఎవరికీ తెలియదు.

           శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నిజరూపమున శ్రీ స్వామి వారికి నాగాభరణం, నాగ యఙ్ఞోపవీతము, నాగమొలత్రాడు బిళ్ళకట్టు పంచతో సుఖాసనం మీద కూర్చుని రాజఠీవితో భక్తులకు దర్శనం ఇస్తారు.

  స్వామి వారి ప్రత్యేకత :-దక్చిణా వ్రుత్తం (తొండం), కోరికలు స్వామి వారి చెవిలో చెప్పకొనుట వలన భక్తులు కోరికలు తీరి పునహ దర్శనం చేయుట జరుగుచున్నది.

   శ్రీ స్వామివారికి ప్రతీ నెలా శుద్ధ చవితినాడు అనగా అమావాస్య వెళ్లిన నాలుగవ రోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నవగ్రహారాధన, సూర్య నమస్కారములు, మహాలింగార్చన, సుందరకాండ, సప్తశతీపారాయణ, గణపతి హోమం, చంఢిహోమం, లక్చపత్రిపూజ జరుగును. మరియూ స్వామి వారి ఆలయము నందు ప్రతీనెలా సంకటహరిచవితి రోజున లక్చపత్రిపూజలు జరుగును. గణపతి నవరాత్రులు గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇంకొక విషయం :-ప్రతీ రోజూ జరుగు అన్నదానం లోని ప్రతీ పదార్థాలు మరియు నిత్య ప్రసాదం లోని ప్రతీ పదార్థాలు వంట బ్రాహ్మణులు చే తయారు చేయించబడును.

     ఇదే గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రత్యేకత పొందినది. వళ్ళీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్ట కూడా ఉంది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుని మొక్కుకుంటే వివాహం కాని వారికి వివాహము జరగడం, సంతానం కలగనివారికి సంతానం కలగడం ఎంతోమంది కి నిదర్శనమని చెబుతారు. కావున ముఖ్యంగా దర్శించవలసిన క్చేత్రము. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు: