26, నవంబర్ 2020, గురువారం

ధార్మికగీత - 92*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 92*

                                    *****

        *శ్లో:-  దైవాధీనం జగ త్సర్వం ౹*

                *సత్యాధీనం తు దైవతం ౹*

                *తత్సత్యం ఉత్తమాధీనం ౹*

                *ఉత్తమో మమ దేవతా  ౹౹*  

                                      *****

*భా:- విశ్వంలో చరాచర సృస్తికర్త  బ్రహ్మ. ఆ జీవకోటి పోషణ, పాలన కర్త విష్ణువు. జీవితాంతాన ప్రాణికోటి  లయకర్త మహేశ్వరుడు. ఈ విధంగా జగన్నాటక సూత్రధారి దేవుడే. ఆ దైవాధీనమే యీ జగత్తంతా. అట్టి  దైవము సత్యానికి అధీనుడై ఉన్నాడు. సత్యమే దైవము. దైవమే సత్యము. సత్యము లేని పూజ,జపము,తపము,మనో  వాక్కాయాలు  ఊషర క్షేత్రంలో బీజావాపనము వంటి వని శాస్త్రం చెబుతోంది. సత్యము లేని పురుషార్థాలు శశి లేని నిశి వలె నిరుపయోగాలు. అట్టి సత్యము ఉత్తముల యొక్క అధీనమై ఉన్నది. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు,శిబి,రంతి,బలి మున్నగు చక్రవర్తులు ఆపత్తులను,విపత్తులను ధైర్యస్థై ర్యాలతో అధిగమించి, సత్యము నాచరించి, "సత్యమేవ జయతే" అని నిరూపణ చేసి చూపించారు. ధ్రువుడు,ప్రహ్లాదుడు,మార్కండేయుడు సత్యనిష్ఠతో దైవ సాక్షాత్కారం పొందగలిగారు. అమేయ కీర్తి గడించారు. అలాంటి "ఉత్తములే నా పాలిట దైవమ"ని శ్రీకృష్ణ పరమాత్మ  ఒక సందర్భంలో  వెలిబుచ్చిన సూనృతవాణి యిది. కాన "సత్యమూలాని సర్వాణి", "సత్యం బ్రూయాత్ - ప్రియం   బ్రూయాత్", "సత్య మేవేశ్వరో లోకే" ఇత్యాది ఆర్యోక్తులను అనునిత్యం గ్రహణ,ధారణ, మననములు చేసికొంటూ, మానవాళి సత్యవర్తనులై  ఆదర్శంగా జీవించి తరించాలని  సారాంశము*.

                                *****

                *సమర్పణ   :    పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: