20, మార్చి 2026, శుక్రవారం

ప్రభావం ప్రారంభమైంది

 

 ప్రభావం ప్రారంభమైంది

ఈరోజు ఉదయం రోజాటి లాగానే మా ఇంటికి సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ కొనుక్కోవటానికి వెళితే అక్కడ టిఫిన్ సెంటర్ తలుపులు ముసి వేసి ఉన్నాయి ప్రతి రోజు ఆ టిఫిన్ సెంటరు ముందర ఎన్నో స్కూటర్లు మోటార్ సైకిళ్ళు ఆగి ఉండే ప్రాంగణం పూర్తిగా బోసిపోయి ఉంది ఎందుకు ఇవాళ టిఫిన్ సెంటర్ బంద్ పెట్టారు నాకు తెలిసి ఆ టిఫిన్ సెంటరు ఏ నాడు ముసి వుండగా నేను చూడలేదు. అందు కాని అనుమానం వేసి నేను  అక్కడి వాళ్ళని విచారిస్తే గ్యాస్ దొరకటం లేదు అందుకే ఈరోజు టిఫిన్ సెంటర్ తెరవలేదు అని అందులో పని చేసే ఒక వర్కర్ చెప్పాడు. ఆహా ఇక కష్టాలు మొదలు అని మనసులో అనుకొని మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని ఇంకొక టిఫిన్ సెంటర్ కి వెళ్లి అక్కడి నుంచి టిఫిన్ కొనుక్కొని వెళ్లాను ఆ సెంటర్ కూడా ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం, పరిస్థితి రోజురోజుకీ జటిలమైతున్నట్టుగా తోస్తున్నది.

 ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్

సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ॥

ఆకాశం నుంచి ఉద్భవించిన జలం ఏ విధంగా అయితే సాగరాన్ని చేరుతుందో అదే రకంగా మనం ఏ భగవంతుడిని పూజించిన అన్ని నమస్కారాలు అ కేశవుడికి మాత్రమే చందుతాయని దీని అర్థం. ఇది మనం నిత్యం చదువుకునే శ్లోకం  దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు ఒక్కడే మనం ఏ రూపంలో ప్రార్ధించిన అని ఒక అర్థము ఎలాగంటే  ఎక్కడ పడ్డ వర్షపు నీరు అయినా కుడా సముద్రంకు చేరుకోవలసిందే అని మనకు తెలుస్తుంది.  అంటే సర్వం ఒకటే అనే అర్ధం మనం తీసుకోవచ్చు.

 ఈరోజు ప్రపంచం మొత్తం ఒక గ్రామంగా పరిగణించవచ్చు ఒక గ్రామంలో ఏ రకంగా అయితే ఒకచోట ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య పూర్తి గ్రామాన్ని చుట్టుముడుతుందో అదే విధంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ప్రభావం ప్రపంచం మొత్తం లో ఉన్న జనాల మీద పడుతుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం. మన దేశానికి ఏ మాత్రం సంబంధం లేకుండా మన దేశానికి ఎంతో దూరంగా ఉన్న ఇరాన్ ఇస్రైయిల్ అమెరిక  దేశాలలో ఈరోజు జరుగుతున్న యుద్ధం నిజానికి మనదేశానికి కాని దేశప్రజలకు కానే ఏరకంగా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని సంబంధం లేదు.  కాని మనం అలా అనుకోవటానికి వీలు లేదు.కాని ఆ యుద్ద పరిణామాలు మనం కుడా  అనుభవించాల్సిన పరిస్థితి వస్తున్నది, అంటే దీనికి మించిన ఉదాహరణ ఇంకోటి లేదు.  ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరో అధికారులు ఎవరో రాజకీయ దురంధరులు వారి వారి రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధాలు చేస్తే మానవ నష్టం ఎలాగో జరుగుతుంది అంతేకాక  దానికి తోడుగా ప్రపంచ జనం మొత్తం కష్టపడాల్సిన పరిస్థితి వస్తున్నది అన్నది సత్యం.

 ఇంకొక విషయం మనం రోజు వార్తల్లో చూస్తున్నాము అనేక విమానాలు మన దేశం నుండి యుద్ధం జరిగే దేశాల వైపుగా వెళ్లి అక్కడికి వెళ్ళిన మన దేశ ప్రజలన్నీ రక్షించేందుకు ఎంతో కష్టపడుతున్నాయి. మార్చి 2026 నాటికి, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన వేలాది మంది పౌరులను స్వదేశానికి రప్పించడానికి, భారతదేశం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరియు ఇండిగో ద్వారా 58 ప్రత్యేక విమానాలను నడుపుతూ అత్యవసర స్వదేశీ తరలింపును నిర్వహిస్తోంది . అవసరమైతే వైమానిక దళం మద్దతుతో, దుబాయ్, దోహా, మస్కట్ మరియు జెడ్డా నుండి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మరియు కొచ్చిలకు విమానాలు నడుస్తున్నాయి. సహాయక చర్యలకు సంబంధించిన కీలక వివరాలు (మార్చి 2026): కీలక ప్రాంతాలు: యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా మరియు ఒమన్‌లపై ప్రధాన సహాయక చర్యలు కేంద్రీకరిస్తున్నాయి. ప్రభుత్వ చర్య: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలు 24x7 హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి మరియు సురక్షితమైన వాయు మార్గాలను నిర్ధారించడానికి గగనతల మూసివేతలను పర్యవేక్షిస్తున్నాయి. 2026 మార్చి ప్రారంభంలో భారతీయ విమానయాన సంస్థలు 15,000 మందికి పైగా చిక్కుకుపోయిన ప్రయాణికులను తిరిగి తీసుకువచ్చాయి. పరిస్థితి వేగంగా మారుతోంది; భద్రతా అంచనాల ఆధారంగా వైమానిక కార్యకలాపాలు దశలవారీగా జరుగుతున్నాయి. తక్షణ సమాచారం కోసం, చిక్కుకుపోయిన ప్రయాణికులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి లేదా ఎయిర్ ఇండియా మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నుండి వచ్చే అప్‌డేట్‌లను అనుసరించాలని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మనకు యేరకంగాను సంబందంలేని ఈ యుద్ధం వలన మనం ఏరకంగా బాధ పడవలసి వస్తున్నది అన్నది తెలుస్తున్నది.  ప్రభుత్వం ఒక విమానం నడపాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుందని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు వేల కొద్ది విమానాలను నడపాలంటే యెంత కర్చు అవుతుందో మనం వేరే చెప్పనవసరం లేదు. కోటాను కోట్ల రూపాయల కర్చు మన దేశ ఆర్దిక వెవాస్త మీద్ పడుత్న్నది. మనదేశం ఆ వేలతిని పురించుకోవటానికి తప్పని సరి పరిస్తితుల్లో ప్రజలమీద్ పన్నుల భారం వేయవలసి వస్తుంది కదా. అంటే మనకు ఏమాత్రం సంబంధం లేని ఎక్కడో దూరంగా వున్నా దేశాలలోని పోరు మనమీద్ ఎలాంటి ప్రభావం చుపెడుతున్నదో కదా.

 ఇంకొక విషయం పెట్రోలు, ప్రత్రోలియం  ప్రొడక్ట్స్ సమయానికి తగువిధంగా దొరకకపోతే అటు వ్యాపారంగము ఇటు సామాజిక రంగం పూర్తిగా అతలాకుతలం అవుతుంది అన్నది అక్షరసత్యం. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం  కేవలం వాహనాల మట్టికే పరిమితం కాదు. మన నిత్యజీవితంలో కొనుక్కునే అగ్గిపెట్ట దగ్గర నుంచి బియ్యం బస్తా దాకా ప్రతి దాని రేటు ఊహించని విధంగా పెరుగుతుంది అంటే సామాన్యులు వారి సంపాదనకు మించిన ఖర్చులు భరించాల్సి వచ్చే  పరిస్థితి ఏర్పడుతుంది.

 కాబట్టి దేశ విదేశ నాయకులు అందరూ ఈ విషయాన్ని గుర్తించి సాధ్యమైనంత మటుకు అక్కడ జరిగే యుద్ధాన్ని నివారించి సామరస్య ధోరణితో వాళ్ళ మధ్య సంధి ఏర్పరచి  ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని ప్రతివారిని ఇందుమూలంగా కోరుచున్నాను ఈ మెసేజ్ ని సాధ్యమైనన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేసి ప్రపంచ శాంతికి అందరం దోహదం చేసే విధంగా తోడ్పడాలని కోరుతున్నాను

 

 

 

కామెంట్‌లు లేవు: