1, మే 2022, ఆదివారం

బ్రహ్మ పథం

 🍁🍁  బ్రహ్మ పథం   🍁🍁

నిర్వహణ:-గాజుల విష్ణువర్ధన్. M. A.

--------------------🙏--------    --------------------

                    ఉచితం

                       ***

  మహాభారతంలో  మనకు తెలియని  కథలెన్నో  దాగివున్నాయి.

    జూదం, ద్రౌపది వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం, వీటినే చూపెడతారు, నిజానికి  ఇప్పటి సమాజానికి  కావాల్సిన "  నీతి కథలు "   ఎన్నో ఉన్నాయి!!!

 అందులో ఇదొకటి.

పంచ పాండవులలో  మొదటివాడైన  ధర్మరాజు  ఎక్కువ ధర్మాలు  చేసేవాడని పేరు. తనకంటే  ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని  ధర్మ రాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని   శ్రీకృష్ణుడికి  అనిపించింది. అందుకోసం  కృష్ణుడు  ధర్మారాజుని  వేరే రాజ్యానికి  తీసుకు వెళ్ళాడు.

 ఆరాజ్యం  మహాబల  చక్రవర్తి గారి  పాలనలో  ఉండేది.    అక్కడ  ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి  బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేశాక  ఆమె  ఆగ్లాసును  బయటికి విసిరేసింది!. 

ధర్మరాజు ఆమెతో, ఏమిటమ్మా బంగారాన్ని  దాచుకోవాలి గాని  ఇలా వీధిలో  పడేస్తే ఎలా?  అని చెప్పడంతో ఆమె,  మారాజ్యంలో  ఒక్కసారి  వాడిన  వస్తువును మళ్ళీవాడము  అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.   ఆరాజ్య సంపదను గురించి  ఆలోచిస్తూ  ఆశ్చర్య పోయాడు  ధర్మరాజు.

 ఇక రాజును  కలవడానికి ఇద్దరు వెళ్లారు, కృష్ణుడు  మహాబలరాజుతో   ధర్మారాజును  ఈ విధంగా పరిచయం  చేయసాగాడు.

రాజా!  ఈయన  ప్రపంచంలోనే  ఎక్కువ ధర్మాలు  చేసిన వ్యక్తి  పేరు " ధర్మరాజు " అని చెప్పాడు. అయినా  ఆరాజు  ధర్మరాజు  ముఖం కూడా  చూడలేడు  సరికదా  కృష్ణుడితో  ఇలా  అన్నాడు.

 కృష్ణా!  మీరు చెప్పిన విషయం  సరికాని, నారాజ్యంలో  ప్రజలకు  సరిపడా  పనిఉన్నది, అందరి దగ్గరా  సంపద  బాగా ఉన్నది, నారాజ్యంలో  అందరికి  కష్టపడి  పనిచేయడం  ఇష్టం, ఇక్కడ  భిక్షం తీసుకోడానికి  తావులేదు, ఇక్కడ ఎవరికీ  దానాలు  తీసుకోవాల్సిన  అవసరంలేదు, ఈయన  రాజ్యంలో  బీదవాళ్లు  ఎక్కువగా  ఉన్నట్టు ఉన్నారు అందుకే, అందరు దానాలు  అడుగుతూ  వస్తున్నారేమో, ఈయన రాజ్యంలో  అంతమందిని  పేదవారీగా  ఉంచినందుకు  ఈ రాజు  మొఖం  చూడాలంటేనే  సిగ్గుపడుతున్నాను అన్నారు !

 తన రాజ్య స్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు  ధర్మరాజు.

 సహాయం అనీపేరుతో  ప్రజలు  అడుక్కుతినేలా మార్చడం, ఉచితం  అనీపేరుతో  ప్రజలను  సోమరులుగా  మార్చిన  దేశం ఎప్పటికైనా  తల దించు కోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మనపాలకులు  ఎప్పుడు తెలుసుకుంటారో, ఉచిత బియ్యం, రుణమాఫి, ఆ పథకం, ఈ పథకం, చదువు  అన్నీ ఉచితమని  ఓట్లు అడుక్కొని ప్రజలను  బిచ్చగాళ్ళుగా  మార్చుతున్నారు, మరి ప్రజలు  ఎప్పుడు మారుతారో.


చిన్న విన్నపం (సే )

        సాధ్యమైనంత  ఎక్కువ మందికి  విధిగా  ఈసందేశం  పంపండి, ఎందుకంటే  కనీసం  కొంతమందినైనా  మార్చి  జాతిని  జాగ్రతం  చేయాలని  ఆశిస్తూ..


        .   ఓం నమః శివాయః..

కామెంట్‌లు లేవు: