23, సెప్టెంబర్ 2024, సోమవారం

*శ్రీ విరూపాక్ష దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 448*


⚜ *కర్నాటక  : హంపి : విజయనగర*






⚜ *శ్రీ విరూపాక్ష దేవాలయం*



💠 హంపిని ఎప్పుడైనా సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా?  అయితే, హంపిలోని అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన విరూపాక్ష దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. 



💠 శివునికి అంకితం చేయబడిన విరూపాక్ష దేవాలయం, కర్ణాటకలోని పురాతన నగరం హంపిలో ఒక ప్రముఖ మైలురాయి. 

ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, చారిత్రక మరియు నిర్మాణ అద్భుతం, ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. 


💠 విరూపాక్ష దేవాలయం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది, దీనిని ద్రావిడ శైలి అని కూడా పిలుస్తారు.


💠 హంపిలోని విరూపాక్ష దేవాలయం రూపకల్పన మరియు నిర్మాణంలో గణిత శాస్త్ర ఆలోచనలను ఉపయోగించడం అనేది కొంతమందికి మాత్రమే తెలిసిన అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. 

 

💠 ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రౌడ దేవ రాయ అని కూడా పిలువబడే పాలకుడు దేవరాయ II ఆధ్వర్యంలోని నాయకుడు లక్కన్ దందేశ నిర్మించారు . 


💠 హంపిని పంపా క్షేత్రం, కిష్కింధ క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని కూడా అంటారు.


🔆 *ఆలయ చరిత్ర*


💠 విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుండే ఈ విరూపాక్ష దేవాలయం ఉందని శీలా శాసనాలు ద్వారా తెలుస్తున్నది. 

చరిత్రకారులు దీనిని 10-12 శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు మరియు హొయసలులు మార్పులు చేసారు, అయితే ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు.

విజయనగర రాజుల పతనం తరువాత, దండయాత్రల వలన 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం చేయబడింది.


💠 విరూపాక్ష ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయంపై కప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.


🔆 *విరుపాక్ష దేవాలయ వర్ణన* 


💠 ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9ఖానాలతో 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం లోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. 

మిగిలిన 7 ఖానాలు ఇటుకతో నిర్మించబడ్డాయి.


💠 తూర్పు ముఖంగా, విరూపాక్షాలయంలో 11 అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజ గోపురం ఉంది. ఈ  రాజగోపురంపై స్త్రీ పురుషుల, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. 

గోపుర ద్వారం లోపల ఒక పక్క  పక్క మూడు తలల  నంది, ఇంకొక పక్క ఒక చిన్న నంది ఉన్నాయి. వీటికి ఎదురుగా మరో గోపురమున్నది.


💠 ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది. దీనిని రాయలవారి గోపురం అంటారు. దీనిని శ్రీ కృష్ణ దేవరాయల వారు నిర్మించినందున దీనిని రాయల గోపురం అని కూడా అంటారు. 

ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణం.


💠 ఇందులో మధ్యన - ముఖమంటపం, దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి. 

గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి.

 అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ మరియు శ్రీ వేంకటేశ్వరుడు వంటి దేవతల ఆలయాలున్నాయి.


💠 విరూపాక్ష స్వామి వారికి పంపాపతి అనే మరొక పేరు కలదు. 

పూర్వం పంపానదిగా పిలువబడినదే ఈనాటి తుంగభద్రనది. 

ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణంలో దీపస్తంభం, ధ్వజస్తంభం, నాలుగు కాళ్ల మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు' నందులున్నాయి.

తర్వాత ముఖమంటపం ఉన్నది. 

ముఖ మంటపంలోనికి ఎక్కేమెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది. 

ముఖమంటపం అనేక స్తంభాలతో, వాటిపై అతి సుందర శిల్పాలతో మలచబడి ఉన్నది.


💠 గర్భగుడికి కుడిప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్రపటం ఉన్నది. 

ఈ అసలు కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు చేయించాడు.


💠 ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉన్నది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపజేస్తారు.


💠 విరూపాక్ష దేవాలయం దగ్గరలో గణపతి విగ్రహం ఉన్నది. ఈ గగణపతి విగ్రహం 15 అడుగుల ఎత్తు మరియు విగ్రహం పైభాగంలో  శనగబడలవలే బుడిపెలతో కూడుకొని ఉంటుంది. దీనిని శనగలరాయి గణపతి అని అంటారు. దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న బుడిపెలతో కూడుకొని 10 అడుగుల ఎత్తులో ఉంటుంది.

దీనిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు. 


💠 ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని తెలియుచున్నది.


💠 గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ శ్రీ విద్యారణ్యస్వామివారి మఠం, ఆలయం ఉన్నది.

ఈ విద్యారణ్యస్వామి 'విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త. 


💠 బెంగుళూరు నుండి 350 కి.మీ మరియు బళ్లారికి 75 కి.మీ. దూరంలో వుంది. 

కామెంట్‌లు లేవు: