జై శ్రీ రామ్
‘‘బ్రాహ్మణులు’’ అనే మాట ‘బ్రాహ్మన్’-అంటే ‘‘యజ్ఞం’’ అనే పదం నుండి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే ‘బ్రహ్మ’ అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని చెప్పుకోవచ్చు. వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణ స్ర్తియందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారంతా బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని ‘‘మాత్రులు’’ అని, వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని ‘‘బ్రాహ్మణులు’’ అని, బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని ‘‘శ్రోత్రియులని’’, నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులు,‘‘అనూచానులు’’ అని, ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్నవారిని ‘‘భ్రూణులు’’ అని, ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని ‘‘ఋషికల్పులు’’ అని, రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని ‘‘ఋషులు’’ అని, సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని ‘‘మునులు’’ అని అంటారు. అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచగౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే స్మార్త గౌడ సరస్వతీ బ్రాహ్మణులు (ఆంధ్రా తెలంగాణా ప్రాంతాల్లో గౌడు లేదా గౌడ అని పిలుస్తారు), భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో ‘‘బహున్’’లుగా, మయన్మార్‌లో ‘‘పొన్న’’లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులతో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని, మూడు ప్రధానమైన విభాగాలున్న
జై శ్రీ రామ్
కంచర్ల వెంకట రమణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి