🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*
. *భాగం - 5*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*
. *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*
శంకరభట్టు ఒక దగ్గర సుఖంగా కూర్చొని శ్రీపాదుల వారి చరిత్ర వ్రాయలేదు.
చాలా ప్రయాసలకు ఓర్చి ఎనలేని కష్టాలు పడి పరీక్షలు ఎదుర్కొని స్వామి వారిని భక్తితో స్తుతిస్తూ శ్రీవారి అనుమతితో స్వామివారి చరిత్ర చూసినది చూసినట్లుగా లిఖించేరు. ఈ గ్రంథం చాలా తక్కువమంది వద్ద వున్నది. శంకరభట్టు పడిన కష్టాలు పగవాళ్ళకి కూడా వద్దు అని అనిపిస్తుంది. మజిలీ మజిలీకి ఆయన కష్టాలు చదువుతూ వుంటే గుండె ద్రవించకమానదు.
శంకరభట్టు కదంబవనం చేరేసరికి ఆయన బరువుకోల్పోయినట్లు అనిపించి దూదిపింజలా తేలిక అయినట్లుగా అనిపించి అటు ఇటు దిక్కు తోచక తిరుగుతూవుండగా ఒక పూరాతన శివలింగం కనబడింది.
చూడచక్కని ఆ మహా శివలింగంను చూసి భక్తితో నమస్కరించిన వెంటనే
కాళ్శు బరువు అయినట్లుగా అనిపించి
ఆ ఆలయప్రాంగణంలో తిరుగుతుండగా సిద్దయోగీంద్రుల వారి దర్శనం లభ్యమయినది.
సిద్దయోగీంద్రులు దీవించి శంకరభట్టు చూసిన శివలింగం చాలా శక్తివంతమైనది దర్శనమాత్రమున దేవేంద్రునికి బ్రహ్మహత్యా దోషము
పోవడంవలన దేవేంద్రుడు ఆ శివలింగానికి ఆలయము నిర్మించేడని చెప్పెను. సిద్దయోగింద్రులవారు శ్రీపాదుల వారి దివ్య దర్శనము చేసుకోమని స్వామివారి ఆశీస్సులు మెండుగా వున్నావని స్వామి వారి చరిత్ర వ్రాయుటకు తనను నిమిత్తం చేసుకొని స్వామివారే వ్రాసుకుంటారని చెప్పి మరలా అదే శివలింగాన్ని దర్శనము చేసుకోమని పంపించేరు.
శంకరభట్టు తీరా వెళ్ళి చూసేసరికి అచ్చట తాను లోగడ చూసిన గుడి బదులు అతి సుందరమైన మందిరం జనసందోహం తో కనబడింది.
తాను మధురలో వున్నట్లు మీనాక్షీ దేవీ సుందరేశుని సన్నిధి లో వున్నట్లు అందరూ చెప్పగా ఆశ్చర్యపోయాడు. సుందరేశుని దర్శనం అనంతరం ఎక్కడ చూసినా సిధ్ధయోగింద్రుల ఆశ్రమము కనబడలేదు.
శ్రీపాదవల్లభుని నామస్మరణ చేసుకుంటూ కొంతదూరం వెళ్ళేసరికి సిధ్దయోగింద్రులు కనబడి శంకరభట్టు చూసిన రెండూ శివాలయాలు ఒక్కటే అని. శ్రీపాదుల వారి కృపతో అప్పటి శివాలయం మరియూ ఇప్పటి శివాలయం కూడా స్వామివారు దయతో చూడగలిగెనని సెలవిచ్చెను. మధురయొక్క స్ధలపురాణం అంతా సిధ్ధయోగింద్రులువారు వివరించి చెప్పి శ్రీపాదులవారు పిఠాపురంలో జన్మించిరని అప్పటిలో కూడా ఆ వూరిలో స్వామివారిని వ్యతిరేకించిన వారు చాలా మంది వుండేవారని స్వామివారు తన బాల్యం నుండి ఎన్నో లీలలు చూపించి తన 16వ యేట తల్లితండ్రులను,వూరివారిని విడిచిపెట్టి విరాగిగా కురుపురం వెళ్ళిపోయారని త్వరగా వెళ్ళి స్వామివారి దర్శనము చేసుకొమ్మని ఆశ్వీరదించి కడుపునిండా ఆహారము పెట్టి చేతితో శంకరభట్టు వెన్నునిమిరి హాయిగా విశ్రాంతి తీసుకోమన్నారు. శంకరభట్టు ఒడలు తెలియకుండా నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి అచ్చట సిద్దయోగీంద్రుల ఆశ్రమము కనబడలేదు. ఆ వింత చూసి తాను భ్రమలో వున్నాడా లేక సిద్దయోగింద్రుడు మాయావా,మంత్రగాడా అని మనసులో తలపోస్తూ మూటా ముల్లె సర్దుకొని ప్రయాణించేందుకు ఉపక్రమించేడు.
సశేషం
ఒకసారి శనీశ్వరుడు దత్త స్వామి దగ్గరకు వచ్చి స్వామి రేపు నీ భక్తునికి ఏడున్నర సంవత్సరములు, కష్టములు రానున్నది. కనుక మీరు సెలవివ్వలసిందిగా ప్రార్థించారు. అప్పుడు దత్తస్వామి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు నా భక్తుడిని రక్షించుకుంటాను అని చెప్పి శనీశ్వరుని పంపించారు. ఆ తరువాత రోజు నుంచి ఆ భక్తునికి కష్టాలు మొదలైనాయి. అంతటి కష్టం లో ఆ భక్తుడు నిరంతరం దత్త దీక్ష లో ఉండి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనే నామాన్ని నిరంతరం స్మరించ సాగాడు దాంతో శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరములు అతని బాధ పెట్టవలసిన శనీశ్వరుడు కేవలం *ఏడున్నర రోజులు* మాత్రమే, అతన్ని కష్టపెట్ట గలిగాడు, ఇదంతా దత్త దీక్ష నామస్మరణ మహిమ, కనుక ఎంత కష్టాల్లో ఉన్న నిరంతరం దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా నామకరణ మనల్ని రక్షిస్తూ ఉంటుంది.
*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి