30, డిసెంబర్ 2023, శనివారం

నీతి శాస్త్రం

 *రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః౹* *భర్తా చ  స్త్రీకృతం పాపం శిష్య పాపం గురోరపి॥* ( గురుస్తథా )

- నీతి శాస్త్రం

తాత్పర్యము - రాజ్యానికి రాజు తండ్రి వంటివాడు  కనుక . రాజ్యంలో ప్రజలను ధర్మమార్గంలో పెట్టవలసిన బాధ్యత రాజుది. ప్రజలు తప్పు ద్రోవ పడితే, దానికి రాజే బాధ్యత వహించాలి. అందువలన ప్రజలు చేసిన పాపాలు బాధ్యుడు రాజు; రాజుకు సరైన సలహాలు ఇస్తూ , అతడు ధర్మం తప్పకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత పురోహితులది. ఒకవేళ పురోహితులు రాజుకు సరైన సలహాలు ఇవ్వని పక్షంలో రాజు చేసిన పాపాలకు పురోహితులు బాధ్యులు. భార్యకు భర్త గురువుతో సమానము. భరించువాడు భర్త. ఆమెను ధర్మ మార్గంలో పెట్టవలసిన వాడు, ఆమెకు సరైన మార్గదర్శనం చేయనిపక్షంలో భార్య చేసిన పాపం భర్తను చేరుతుంది. తనను శరణు వేడినవారికి ధర్మమార్గం చూపి, మార్గదర్శనం చేయుట గురువు కర్తవ్యం. శిష్యుడు చేసిన పాపాలన్నిటికి గురువే బాధ్యుడవుతాడు. పైగా శిష్యుని బాధ్యతను తీసుకున్నందుకుగానూ శిష్యుడు చేసిన పాపాలన్నీ గురువునే చేరతాయి.

కామెంట్‌లు లేవు: