4, అక్టోబర్ 2024, శుక్రవారం

ఉమ్మెత పూవుచంద్రునకుసాటి యగునా?

 [03: 


ఉమ్మెత పూవుచంద్రునకుసాటి యగునా?


వారక ఈశ్వరుండు తలపై ధరియించిన యంత మాత్రము న

వ్వారిజ వైరి తోడ సరివత్తువె యుమ్మెత పూవ నీ పసనన్ 

వారిధు లుబ్బునో దెసలు వన్నెలు దీరునొ చంద్రకాంతముల్ 

నీరవునొ చకోరముల నెవ్వగ తీరునో తాపమారునో 


అర్థము:--- ఎవరో శివ భక్తుడు ఈశ్వరుని తలపైన ఉమ్మెత్త పూవును వుంచాదాడట. దానితో ఉమ్మెత్త పువు నేనూ చంద్రుడిలా శివుని తలపై వున్నాను నేను చంద్రుని లాంటి వాడినే యని గర్వ పడిందట. 


అధికారంతో కుయుక్తులతో గద్దె నెక్కిన వారిని యీ పూవు తో పోలుస్తున్నాడు కవి. కాసేపు శివుని తలపై ఉన్నంత మాత్రాన చంద్రునితో నీవు సమాన మౌదునని అనుకుంటున్నావా?చంద్రుని కాంతితో సముద్రములు వుప్పొంగినట్లు నీ కాంతి తో పొంగుతాయా? దిశలన్నీ వెన్నెలతో వెలిగినట్లు నీ తెల్లదనం తో వెలుగు తాయా?

వెన్నెలను పానము  చేసి తమ దప్పికనూ,తాపాన్నీ చకోర పక్షులు తీర్చుకుంటాయి. మరి నీవు ఆ చకోరాల దాహాన్ని తీర్చ గలవా?చంద్ర కిరణాల స్పర్శ తోచద్రకాంత శిలలు చేమ్మగిల్లినట్టు నీ తెల్లని రంగుతో చేమ్మగిల్లుతాయా?


అలాగే సంఘం లో అధికారస్థానమే గొప్పది కాదు. దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యము కూడా కావాలి. ప్రజలకు సేవ చెయ్య గలగాలి,.ప్రజల మనస్సులో స్థానం సంపాదించు కోగాలగాలి, 


అధికారం లో వున్నవాళ్ళు తమకు స్నేహితులని గొప్పలు చెప్పుకుని తమ పబ్బాలు గడుపుకునే వారు,అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునే వాళ్ళు ఈ పద్యములోని ఉమ్మెత్త పూవు వంటి వారే. ఆ అధికారము పోయినప్పుడు పూవు వలే వడలి రాలిపోతారు.


 శివుని మీద వున్న ఉమ్మెత్త చంద్రుడు కానట్టే చట్ట సభల్లో, విద్వత్ సభల్లోకూర్చున్న మూర్ఖుడు యీ ఉమ్మెత్త పువు వంటి వాడే. ఈ నాటి రాజకీయాలకు సరిపోయే పద్యమిది.🙏🙏🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: