4, అక్టోబర్ 2024, శుక్రవారం

సంప్రదాయం

 🕉️ అమూల్య వాక్కులు 🕉️ 

 మన సంప్రదాయం కొనసాగిద్దాం.

---------------------------------------------

 శ్రీ కృష్ణుడు 5 వేల సంవత్సరాలకు పూర్వం అంటే ద్వాపర యుగం లో సత్యభామ తో కలిసి నరకాసురుణ్ణి చంపడం జరిగింది. ఎందుకంటే నరకాసురుడు వేల మంది కన్యలను చెరబట్టి బంధించాడు, వారికి విముక్తి కలిగించాలని శ్రీ కృష్ణుడు యుద్ధం చెయ్యవలసి వచ్చింది. అతడిని చంపే అవకాశం సత్యభామ కు ఇచ్చాడు శ్రీ కృష్ణుడు.. ఇది జరిగింది ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు.  ఆ సంతోషం లో ప్రజలు మర్నాడు అంటే అమావాస్య నాడు అదే దీపావళి బాణాసంచా (టపాకాయలు) కాల్చారు. చతుర్దశి నాడు తెల్ల వారు ఝామున నువ్వుల నూనె రాసుకుని తలంట్టుకోవాలి. సాయంత్రం దీపాలు పెట్టడం పితృదేవతలకు దారి చూపడానికి దీపావళి నాడు టపాకాయలు కాల్చడం మన సంప్రదాయం. ఇది 5 వేల సంవత్సరాలనుండి వస్తోంది. మనం దీనిని కొనసాగిద్దాం. విదేశాల్లో అంటే అమెరికా, జపాన్ లాంటి దేశాలలో ఏదో ఒక సందర్భం లో టపాకాయలు కలుస్తారు అని మనకు తెలుసు.

-------- ఇవటూరి భవానీ శంకర్. 🕉️

కామెంట్‌లు లేవు: