7, ఫిబ్రవరి 2023, మంగళవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*అవధూత లీల పారాయణ మహత్యం*


పి.సీతారామాంజనేయులు, భవానీపురం, విజయవాడ వారి అనుభవాలు..


నేను సుమారు 11 మాసాలనుంచి సరిఅయిన ఉద్యోగంలేక, అనారోగ్యంతో (కిడ్నీ వ్యాధితో), నేను చేస్తున్న ఉద్యోగంలో కూడా జీతం సరిగ్గా రాక, సుమారు 87,000/- రూపాయలు కంపెనీ నాకు బాకీ పడింది. అది రాక, ఉద్యోగం చేయక, మానసిక మనస్పర్ధలతో ఉండగా శ్రీభరద్వాజ సత్సంగ మండలి, భవాని పురం రాజా మాష్టారిగారి 2 సత్సంగాలకు హాజరయ్యి శ్రీ గురుచరిత్ర పారాయణాన్ని 2. ఏకాహాలు, 5 సార్లు సప్తాహాలు పూర్తి చేశాను. ఆ సత్సంగ సభ్యులు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారి సలహా మేరకు రెండువేల రూపాయలు అప్పు తెచ్చుకొని గొలగమూడి శ్రీ వెంకయ్యస్వామి వారిని 12-02-2002 న మొదటిసారిగా దర్శించాను. 


13వ తారీఖున (13-02-2005) ఓంగోలులోనే శ్రీ భరద్వాజ మాష్టారిగారి సమాధిని దర్శించి శ్రీ వెంకయ్యస్వామి వారి "అవధూత లీల" 3 సప్తాహాలు వరుసగా చదువుతాను అనుకొని నాకు కంపెనీ బాకి ఉన్న డబ్బులు రావాలి, మంచి ఉద్యోగం రావాలని స్వామివారిని కోరుకుని, 13-02-2005 న విజయవాడ చేరి 14-02-2005 నుంచి అవధూతలీల పారాయణ ప్రారంభించాను. చిత్రంగా ఆరోజు కిడ్నితో చాలా బాధపడి 3 రాళ్ళు బయటికి వచ్చాయి. దానికి నేను ఏ మందులు వాడలేదు.


 పారాయణ మాత్రము చేతనే నాకు అట్టి భాగ్యమును శ్రీ వెంకయ్యస్వామి వారు ఇచ్చినారు. అట్లాగే అవధూత లీల 2 సప్తాహాలు పారాయణ అయిన వెంటనే పాత కంపెనీ వారు పిలచి 20,000/- (ఇరవై వేల రూపాయలు) ఇస్తామని ఉద్యోగం చేయమని. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీరు డీలరుగా ఉండి, వ్యాపారాన్ని సాగించమని దానికిగాను జీతంగా కాక, 12% కమీషన్తో వారి వ్యాపారంలో నాకు మార్కెటింగ్ అవకాశం కల్పించారు. 12-02-2005 నుంచి 12-05-2005 వరకు సుమారు అరవై వేల రూపాయలు నాకు వచ్చాయి. నా మానసిక ఆర్థిక పరిస్థితులు *కేవలం శ్రీ స్వామి వారి చరిత్ర పారాయణ వలన మెరుగయ్యాయి*, ఆ మహానీయనికి ఎప్పటికి ఋణపడిఉంటాను.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ మాష్టారు గారి బోధల లో కొన్ని ముఖ్యమైనవి


తైలధారవలె చేయు నామస్మరణతో మాత్రమే మన పాపాలు కడిగివేయ (దహించి) బడతాయి. అందుకని స్నానం చేసేటప్పుడు, పళ్ళుతోముకొనేటప్పుడు, బట్టలుతికేటప్పుడు, అన్నం వండేటప్పుడు, తినేటప్పుడు, రోడ్డున నడిచేటప్పుడు, మలమూత్రవిసర్జనప్పుడు, ఇల్లు సర్ధుకునేటప్పుడు నామ స్మరణ తప్పకుండా చేయాలి. 


గురుస్తుతి నిద్రలేచినప్పుడు మరియు నిద్ర కుపక్రించే టప్పుడు వీలైనంతసేపు సద్గురువు మనకిచ్చిన అనుభవాలను మననం చేయాలి.


ఖాళీ సమయాల్లో పచ్చిసెనగలు/బియ్యం నామస్మరణతో ఏరి వాటిని ధునికి సమర్పించాలి. 


ప్రదక్షిణ మందిరంలోకుదరకపోతే ఇంట్లో కుర్చీలో పటం పెట్టుకొని ప్రదక్షిణ చేయాలి.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: