7, ఫిబ్రవరి 2023, మంగళవారం

సద్బోధ


                   *సద్బోధ*

                   ➖➖➖



*నమ్మకం, విశ్వాసం,   ప్రేమ తత్వం కృతజ్ఞతా భావం  క్షమాగుణం    సేవా భావాన్ని కలిగి యుండడం అనేది గొప్ప అధ్యాత్మిక ధ్యాన మార్గం..!  పైవన్నీ సరైన సాధన మార్గం ద్వారా మాత్రమే సాధ్యం..!      కష్ట సుఖాలు అనేవి పూర్వ జన్మ మంచి చెడు కర్మలు మీద ఆధారపడి ఉంటాయి. మంచి కర్మలు చేసుకున్నవారు అధ్బుతంగా జీవిస్తూ సరైన సాధన ద్వారా    ఇంకా ఇంకా మరికొంత    మంచి కర్మలు చేస్తూ అపూర్వంగా ఎదిగిపోతారు.*


*చెడు కర్మలు  ఆధారంగా    జన్మ తీసుకున్నవారు రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు సరైన సాధన ద్వారా చెడు కర్మలు దగ్దం చేసుకొని ఆనందకరమైన జీవితాన్నీ అనుభవిస్తారు.*


*ఏది కావాలన్నా ఏది పొందాలన్నా ఏది చేయాలన్నా సరైన సాధన మాత్రమే మూల సూత్రం అని ఎందరో మహానుభావులు చెప్పారు.* 


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


          లోకాః సమస్తాః సుఖినోభవన్తు!


   

                    *సద్బోధ*

                    ➖➖➖


*"ఇతరులు తప్ప, తాను మాత్రం తప్పు చేయను" అనుకోవడం..*


*ఎందరో తనకళ్ళముందు మరణించడం చూస్తున్నా "తాను మాత్రం దీనికి అతీతుడను" అకోవడం..*


*ఇది అజ్ఞానం - భ్రమ - పరమాత్ముని లీలలను అర్థం చేసుకోక పోవడం.. కృతజ్ఞతా భావం లేక పోవడం."తానే జ్ఞాని "అనే అహంకారం, తుచ్చమైన సంపదలు - శరీరం పై మమకారం మనిషి వినాశనానికి కారణం అవుతున్నాయి.*


*దేవాలయదర్శనం, సద్గురువుల సేవ  రామాయణం మొదలైన భాగవత గ్రంథాలు శ్రవణం చేయడం చదవడం, నిరంతర ఆధ్యాత్మిక చింతనం - సాత్విక ఆహారం మొదలైన ఉత్తమ సాధన ప్రక్రియలద్వారా మాత్రమే - ఉత్కృష్టమైన ఈమానవజన్మను సార్థకం చేసుకొనగలుగుతాం...*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                             🌷


           లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

: *శ్రీ స్వామిమలై-సుబ్రహ్మణ్య స్వామి*

            *ఆ క్షేత్ర విశేషాలు:*

                


 

*తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలో ‘స్వామిమలై’ ప్రసిద్ది చెందిన దేవాలయం.*


*’స్వామి మలై’ అంటే దేవుని పర్వతం అని అర్థం.*


*తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఉంది.*

 

 *సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందిన స్థలమిది.*


 *సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది.* 


*ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై, నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి ‘స్వామి నాథుడ’నే పేరు వచ్చింది. ఈ స్థలానికి ‘స్వామిమలై’ అనే పేరు వచ్చింది.*


 

*అతి పురాతనమైన ఈ ఆలయాన్ని        ‘కార్త వీర్యార్జునుడు’ కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు.*


 

*ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు.* 


*ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరును తమిళంలో వ్రాసి ఉంటుంది.*


*ఈ మెట్లు ఎక్కే నడక దారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్కడ కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. అలాగే ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతులు మంటపాలున్నాయి.*


*పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు.*


*ఆయన కులదైవమైన మీనాక్షి సుందరేశ్వరుని ఆరాధించడానికి ఈ మంటపాలనేర్పరచాడు.*

 

*ఈ ఆలయంలో ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి.*


*కొంగు ప్రాంతం నుండి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చే సరికి ఆయనికి కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకున్ని నేత్ర వినాయగర్ అని పిలుస్తారు.*


 

*పురాణ కథనం ప్రకారం ఈ దేవుని సన్నిధికి వచ్చి నిశ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి.*


*ఈ దేవాలయంలో వివాహం చేసుకున్న వారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు.*

 

*ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు.*


*దేశ, విదేశాల నుండి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారికి పాలకావడి, పూల కావడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు.*

 

*సాయంత్రంలో స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే ఆ సమయంలో అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు.*

*అప్పుడు స్వామి వారి సౌందర్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, ఆ అపురూప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు.*


*60అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.*

కామెంట్‌లు లేవు: