*జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!*
ఈ సమస్యకు నాపూరణ.
అమలిన భక్తి భావముల నార్ధ్రత పైకొన తన్మయత్వమున్
సుమముల నెంచి నన్నిటను సుందర మూర్తుల మోములన్నిటిన్
కమలపు సామ్యమున్ దెలిపి కావ్యము లల్లరె గొప్పదైన కం
జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి