*హైందవం వర్ధిల్లాలి 28*
సభ్యులకు నమస్కారములు.
*మహిళా గౌరవం. అశ్లీలతలకు తావివ్వని విధంగా సముచిత, సమున్నత స్థానం స్త్రీల కివ్వాలి, గౌరవించాలి* :-
సృష్టిలో సమాన భాగస్తురాలు స్త్రీ అను విషయము జగద్విదితమే. స్త్రీమూలకమే ఈమానవ సృష్టి అనునది కూడా విశ్వ సత్యమే.*వారిని గౌరవించడం మానవ లక్షణం*. ఎవరి విషయంలో నైనా మర్యాదలు పాటించాలి అను అంశము *ముఖ్యంగా* స్త్రీల విషయము వచ్చినప్పుడు *ఈ యువతరాన్ని (30 ల లోపు) మినహాయించి* మిగతా వారు హైందవ ధర్మములు, సంస్కృతి, సంప్రదాయములు తెలిసిన వారెవరైనా పురాణ, ఇతిహాస గ్రంథాలను, అందులోని సన్నివేశాలను మననం చేసుకుంటారు. బృహత్సంహిత లోని ఒక చరణం పరిశీలిద్దాము. *గుణాదికాస్తా మనునాత్ర చోక్తం, ధార్ ష్ట్యేన పుంభీః ప్రమదా నిరస్థాః*. అర్థం:- స్త్రీలు పురుషులకంటే ఏ మాత్రము తక్కువ కారు, సరికదా ఒక్కొక్క దగ్గర వారు పురుషుల కంటే శక్తిమంతులు, గొప్పవారు కూడా. ఇతిహాస గ్రంథాలలోనే మరియొక మాట గూడా గమనించాము. స్త్రీని అవమానించిన రావణుడు, ధృతరాష్ట్రుడు సమూలంగా నశించారు. యుగాలు మారినా వారి అపకీర్తి మాసిపోలేదు. *ఈ కలియుగపు ఆల్ఫాయుష్కులు స్త్రీలనవమానించి మనుగడ సాగించగలరా.* చట్టపు కబంధ (ఎంత దూరమైనా వెళ్లగల) హస్తాలు, విధిగా కాలం విధించే ప్రతిక్రియల వలన దుర్గతులు తప్పవు, ఇది తథ్యము.
ప్రస్తుత జెట్ మరియు రాకెట్ యుగంలో ఇంకా మను స్మృతులు, సంహితలు అవసరమా అని యువతరం చమత్కరిస్తూ, హేళనచేస్తూ ఉంటుంది. మంచి ఎక్కడున్నా, ఎవరు చెప్పినా స్వీకరిద్దామని గత వ్యాసాలలో యోచనచేశాము.
*సమాజం స్త్రీల రక్షణ మరియు గౌరవార్థం కొన్ని మార్గ దర్శక సూత్రాలు పాటించాలి*. సమాజమంటే పురుష సమాజమే కాదు స్త్రీ సమాజం కూడా. కళాశాలలో రాగింగ్ సంస్కృతికి స్వస్తి చెప్పాలి. గృహాలలో అత్త మామలు కోడళ్లను, కొడుకులు కోడళ్ళు అత్తమామలను, తల్లి తండ్రులను క్షోభ పెట్టరాదు. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమాభిమానాలు, చిన్న వారు పెద్ద వారి పట్ల భక్తి గౌరవాభిమానాలు చూపెట్టాలి. పట్నాలు, నగరాలకు వచ్చిన, వస్తున్న గ్రామీణ అమాయక యువతులను కాపు కాసి, మభ్య పెట్టి గల్లంతు చేసే దుష్టులను, దుండగులను చట్టానికి అప్పజెప్పాలి. ఆడపిల్లలను మాయం చేసేవారు, వేశ్యా గృహాలకు తరలించే నీతి తప్పిన మూఠాలున్న, ఇటువంటి సమాజంలో ఇంకా ఎన్నెన్నో అరాచకాలు. *ఇంకా వివరమైన సోదాహరణ ప్రయత్నము కూడదనిపిస్తుంది*.
ఇవన్నీ తెలువని వారెవరు ఇంత పొడిగింపు అవసరమా అని సభ్యులకు తలంపు రావచ్చును. తరం మారుతున్నది. పెద్ద తరం (50 నుండి 80) వారికి ఇవన్నీ అనుభవేకవేద్యమే, కాని యువతరం (15 నుండి 50 వరకు) వారికి గూడా ఈ సమాజ, సహజ బాధ్యతలు తెలిసి ఉండాలి.
హిందూ సమాజం ముఖ్యంగా భారతీయ సమాజం నిస్సత్తువగా, నిర్లిప్తంగా, అచేతనంగా ఉండవద్దు, ఆ భావనలను ఇప్పటికైనా త్రుంచివేయాలి. *కనీసం ఇతర మతస్తుల ఏకీ భావం చూసైనా నేర్చుకుందాము*.ఆ జాతిలో ఏ ఒక్కరికీ అపకారం, అన్యాయం జరిగినా *ఆ జనాలు* గుంపులు గుంపులుగా వచ్చి చేరుతారు, *వారిని ఆదుకుంటారు*. ఇతర జాతులు హిందువులను హింసించినా దోపిడి, దౌర్జన్యం చేసినా హిందు ఆడపిల్లలపై, గృహిణులపై అఘాయిత్యాలు చేసినా హిందువులు వెంటనే స్పందించాలికదా. చేవ, చైతన్యం, స్పందన లేని మతం హిందు మత మొక్కటే అను అపప్రథ విశ్వ మంతా వ్యాపించకముందే ముందే మేల్కొందాము. హిందువులలో విద్యాధికులు, ,మేధావులు
అధికారులు, సమాజ సంస్కర్తలు, ప్రజా నాయకులు, మహిళా సంఘాలు ఇంకా ఎన్నెన్నో సాంఘిక స్పృహ కల్గిన బృందాలు, సంస్థలు దేశభక్తిని నింపేవి దేశ ప్రజను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. *వీటన్నిటి కర్తవ్యం నిరంతరం సమాజమును ఎప్పటికప్పుడు గమనిస్తూ, అమాయకులను ఆపదల నుండి రక్షించు చర్యలు చేపడ్తూ ఉండాలి. బలహీనులైన వారిని స్త్రీ మరియు పురుష బేధం లేకుండా ఆదుకోవాలి.* కావున *ఐక్యతతో* మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి