27, ఏప్రిల్ 2022, బుధవారం

ఆవిర్భావ దినోత్సవం

 తెరాస@21.


ఓ స్వతంత్ర కాంక్షకు

ఆరు దశాబ్దాలు గడిచాయి.

ఓ భావోద్వేగానికి పదునాలుగు యేండ్లు,

ఓ స్వరాజ్య పాలనకు

ఏడు వసంతాలు.


ఎందరో బలిదానాలు

ఎన్నో తిరుగుబాట్లు 

ఎన్నెన్నో ఉద్యమాలు

తెలంగాణ పోరాటాలు.


ఎన్నో అవమానాలు

ఎన్నెన్నో ఈసడింపులు

మరెన్నో అసమానతల నడుమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన...


తెలంగాణా రాష్ట్ర సమితికి

ఇరవై ఒక్క సంవత్సరాలు.

స్వీయ పాలన కోసం పోరాటం..


స్వతంత్ర రాష్ట్రం కోసం 

శాంతియుత పోరాటం.

అలుపెరుగని తెరాస పోరాట ప్రస్థానం...


రాజకీయ చైతన్యంతో

మలివిడత 'కారు' పోరు..

మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు అంటూ

కదిలే తెలంగాణ సమాజం.


తెరాస పోరాటంలో

రాష్ట్ర ఏర్పాటు కోసం

తెలంగాణ వచ్చుడో

కేంద్రం పని పట్టుడో అంటూ...


నినాదాలు రగిలించే

సకల జనుల సమ్మె

రహదారిన వంటావార్పు

జనంలో స్వతంత్ర ఆకాంక్ష..


నిప్పు కణికలై ఎగసే

ఆత్మ బలి దానం జరిగే

శ్రీకాంత్ చారీ ఆత్మార్పణ

కే.సి.ఆర్ నిరాహార దీక్ష..


తెరాస ఉద్యమించేను

ప్రజలు పోరు సల్పేను

కేంద్రం కళ్ళు తెరిచేను

తెలంగాణా ప్రకటించేను.

 

తెరాస పోరుబాటన

తెలంగాణా వచ్చేను

స్వతంత్ర రాష్ట్రమయ్యేను

ప్రజల కల నిజమయ్యేను.



తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం 

పురస్కరించుకుని యావత్ తెలంగాణా ప్రజానీకానికి శుభాకాంక్షలు..


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

కామెంట్‌లు లేవు: