25, ఫిబ్రవరి 2023, శనివారం

బ్రాహ్మణ్

 “బ్రాహ్మణ్ ద గ్రేట్”


 దేశం అంతటా బ్రాహ్మణులను గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా మధ్య ప్రదేశ్‌ ఐఏఎస్‌కి చెందిన నియాజ్ ఖాన్ గారు బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకాన్ని రాసారు.. ఇంకా విడుదల కాలేదు... 


మునేష్వర్ కుమార్, నవభారత్ టైమ్స్ పాత్రికేయుడు- దేశంలో బ్రాహ్మణుల గురించి చర్చ జరుగుతోంది. మోహన్‌జీ భాగవత్ గారి వ్యాఖ్యల తరువాత వివాదం మరింత పెద్దదైంది. ఈ మధ్యలో మీరు బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకాన్ని రాసారు. ఇది ఎందుకు రాసారు, ఇందులో ఏమి ఉంది.   


నియాజ్ ఖాన్- మోహన్‌జీ ఈ మధ్యనే ట్వీట్ చేసారు. నేను బ్రాహ్మణులకి సంబంధించి చాలా కాలంగా రిసర్చ్ చేస్తున్నాను. ఈ మధ్యలో భాగవత్‌జీ వ్యాఖ్య రావడం యాధృచ్ఛికం మాత్రమే. ఇంక పుస్తకంలోని విషయమేమిటంటో, నేను వేదాలను అధ్యయనం చేసాను. పురాణాలను అధ్యయనం చేసాను. ఉపనిషత్తులను చదివాను. ప్రత్యేకంగా కౌటిల్యుని జీవిత చరిత్రని అధ్యయనం చేసాను. అది చాలా ప్రేరణ కలిగించింది. 3000 వేల సంవత్సరాల చరిత్రని తిరగేసినప్పుడు బ్రాహ్మణులు నిరంతరత దేశంలో చాలా సుధృడంగా ఉంది. పూజ, ఆధ్యాత్మిక విద్య, ఇతర సంస్కారాల అందిచడంతో పాటు ఉపాధ్యాయులగా పని చేసారు. అవసరమైన దేశానికి సహకరించారు. దేశ సీమలకి కూడా బలాన్ని చేకూర్చారు. నాకు ఇది ఒక ప్రత్యేకమైన విషయం అనిపించింది. 3000 సంవత్సరా గొప్ప చరిత్ర కలిగిన ఈ కమ్యూనిటీపైన ఒక పుస్తకం రాయాలని అనిపించింది. ఈ ప్రేరణతోని బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకం రాబోతోంది.


పాత్రికేయుడు- మీరు ఏ ఏ వేదాలను అధ్యయనం చేసి విషయ సేకరణ చేసారు.


ని.ఖా- వేదాలు నాలుగు ఉన్నాయి. అవి చాలా విస్తృతమైనవి. వాటిని చదవాలంటే 6 నెలలకి పైగా సమయం పడుతుంది. నేను ప్రముఖంగా హోలీ వేదాస్ పుస్తకాన్ని చదివాను. దాంట్లో అనేక మంత్రాలు ఉన్నాయి. నాలుగు వేదాలకి సంబంధించిన ఇది మంచి పుస్తకంగా. వీటితో పాటు దక్షిణ, ఉత్తర భారత దేశానికి బ్రాహ్మణులకి సంబంధించి అధ్యయనం చేసాను. ఉపనిషత్తుల విజ్ఞాన్ని గురించి చదివాను. దధీచి గురించి చదివాను. బారత దేశంలోని అందరు మహాపురుషల గురించి, ప్రత్యేకంగా చాణుక్యుడి గురించి చదివాను. ఇలా విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేసిన తరువాత గత 50-70 సంవత్సరాల వెనక బ్రాహ్మణుల స్థితి ఎలా ఉంది, 3000 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, స్వాతంత్ర్యం వచ్చాక వీరి స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసాను. ఇవి అన్నీ అధ్యయనం చేసాక ఈ నవల రాసాను. 


పాత్రికేయుడు- బ్రాహ్మణులు బ్రహ్మద్వారా సృష్టించబడ్డారని మీరు ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ తరువాత అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. మీరు బ్రాహ్మణలని ఎందుకు సమర్ధిస్తున్నారనే వ్యాఖ్య కూడా వచ్చింది. 


ని.ఖా.- నేను చార్ల్స్ డార్విన్ (Charles Robert Darwin),  హార్బర్ట్ స్పెన్సర్ (Herbert Spencer) ద్వారా ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం  (Theory of evolution) ప్రకారం కాలంతో పాటు ఏ జీవరాశి అయితే మనగలుగుతుందో అది మాత్రమే భూమి పై జీవించి ఉంటుంది. దీని ఆధారంగానే బలం ఉన్నవాడే జీవిస్తాడు (Survival of the fittest) అనే సిద్ధాంతం వచ్చింది. ఈ విధంగా 3000 సంత్సరాల చరిత్రని తిరగేస్తే అనే భూకంపాలు, తుఫాన్లు వచ్చాయి. విదేశాల నుండి వచ్చి పరిపాన చేసారు. బ్రాహ్మణుల వ్యవస్థ, పరంపర కొనసాగుతూ వచ్చింది. వేదాలు,  వారి సామాజిక గతి నడుస్తూనే ఉంది. ఎన్ని విషయ పరిస్థితులు వచ్చిన బ్రాహ్మణులు జీవిస్తూ వచ్చారు. కేవలం జీవించడం కాదు, దేశ గౌరవాన్ని ముందుకి తీసుకు వెళ్ళారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో బలాన్ని అందిచారు. సీమా క్షేత్రాలకు బలాన్ని చేకూర్చగలిగారు. గొప్ప సంస్కృతిని నిలిపి ఉంచారు. ఈ దృశ్యా చరిత్రలో వీళ్ళ ఐక్యూ చాలా వ్యాపకమైనది. చాలా పెద్దది. ఈ సందర్భంగానే నేను ఆ ట్వీట్ సాహిత్యపరమైనది. దాని ద్వారా చరిత్ర తిరగేస్తే వీళ్ళు గోప్పగా రాణించారని, వారికి ఇచ్చిన పనిని  గొప్పగా నిర్వర్తించారని చెప్పాను.

పాత్రికేయుడు- మీరు వేదాలు ఇతర గ్రంథాల గురించి ప్రస్తావించారు. ఈ మధ్యనే దేశంలో రామచరిత్ మానస్, మరి కొన్ని పుస్తకాలకి సంబంధించి అనేక వాదోపవాదాలు వస్తున్నాయి. దానిని గురించి మీరేమంటారు.


ని.ఖా.- నేను ఇటువంటి వివాదాలలో పడదలుచుకోలేదు. నా విషయం భిన్నమైనది. నా అధ్యయనం బ్రాహ్మణుల ఐ.క్యూ., పుట్టుకతో వచ్చిన గుణాలు వాళ్ళ పనితీరుకి సంబంధించినది. దేశంలోని వర్ణ వ్యవస్థ, అసృస్యత, ద్వేషం లాంటి విషయాలపై నేను ఏ మాత్రం వెళ్ళదలుచుకోలేదు. నేను వీరిని ప్రపంచంలో ఒక గొప్ప మేధావి వర్గంగా ఉండినారని అనుకుంటున్నాను. ప్రపంచంలో అనేక ఆవిష్కరణలకి సంబంధించి తెల్లవారిని గురించబడతారు. అరబ్ యొక్క యహూదీ (జ్యూస్‌ అనబడతారు) లను తీసుకుంటే ప్రపంచంలో విజ్ఞానం ప్రథమ స్థానంలో వారిని పరిగణిస్తారు. బ్రాహ్మణులు కూడా మన దేశంలో ప్రథమ (1st Class) స్థాయి ప్రతిభని చూపించారని నాకు అనిపిస్తుంది.  అందువలన నా విషయ వస్తువు ఈ గ్రంథాలకి సంబంధించినది కాక, నేను అవి చదవదలుచుకోలేదు.. నేను కేవలం అధ్భుతమైన ప్రతిభ చూపిన గొప్ప గొప్ప సాధు, సంత్‌లు, ఋషులు, జ్ఞానులు, ఆచార్యులు లాంటి వారు ఉండిన, దేశం కోసం ఎంతో చేసినటువంటి ఆ వర్గం యొక్క కర్మ పై నా పుస్తకం ఆధారపడి ఉంది తప్ప, నేను ఈ వివాదాలలో పడదలుచుకోలేదు.


పాత్రికేయుడు- ధార్మిక పుస్తకాల వివాదమంతా బ్రాహ్మణులపైననే ప్రశ్నలు సంధించబడుతున్నాయి.. వర్ణ వ్యవస్థ ప్రశ్నిచంబడుతోంది... రామ్ చరిత్ మానస్ చౌపాయిల తప్పుడు వ్యాఖ్యానం జరుగుతోందా.. కొందరు ఈ చౌపాయీలను తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారని కూడా అన్నారు.. మీరు ఏమంటారు.


ని.ఖా.- ఏ ధర్మిక పుస్తకాన్ని తీసుకుని చదివిని కేవలం ఆ పుస్తకంలో సంతృప్తిపడడం కష్టము. ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఏ పుస్తకాన్ని తీసుకున్నా ప్రతీ వ్యక్తి సంతృప్తి చెందడు. వివాదానికి దారి తీస్తుంది. ఒకొక్క వ్యక్తి ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తాడు. కాబట్టి నేను వీటి లోతులవైపుకి వెళ్ళను. నేను వర్ణ వ్యవస్థని సమర్ధించను. ద్వేషాన్ని సమర్ధించను. నా పుస్తకంలో ఎటువంటి ద్వేషము కనిపించదు. నాకు తెలిసి మన దేశంలో ఒక గొప్ప జాతిగా (బ్రాహ్మణ) ఉండేది. వారిది భాగస్వామ్యము ప్రథానమైన. వాళ్ళ ఐ.క్యూ.ని చూస్తే వాళ్ళు ఇప్పటికీ అనేక రంగాలలో గొప్ప పనితీరుని కనబరుస్తున్నారు. వాళ్ళ మేథని దేశం కోసం మరింత గొప్పగా వాడుకుంటే... నేడు వాడుకుంటున్నారు కూడా.. మరింత లాభాన్ని పొందవచ్చు. మరొక విషయం నేను అనుకునేది.. వర్ణ వ్యవస్థ ఏర్పడినప్పుడు, అది ఎవరి పట్లు ద్వేషంతో కూడినది కాక సమాజం సౌఖ్యంగా కొనసాగడానికి ఏర్పడిన పని విభజన మాత్రమే. కాలంతో పాటు ద్వేషం విస్తరించింది. కానీ చాణుక్యుడు లాంటి గొప్పవాడు, చంద్రగుప్త మౌర్యుడులాంటి గొప్ప రాజుని నిర్మాణం చేసాడు. విశాలమైన, సమర్ధవంతమైన భారత నిర్మాణం చేసాడు. బ్రాహ్మలు ద్వేషానికి బదులు దేశం యొక్క ఏకత్వం కోసం పని చేసారు. అందరి కోసం పని చేసారు. ప్రేమ పంచారు. వాళ్ళా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఏకత్వానికి పేరు. అక్కడ ద్వేషానికి స్థానం లేదు. నేను ఒక కులానికి చెందిన వాడిని కాబట్టి, మరొకరిని తక్కువ అనుకునే వారికి నేను సమర్థకుడిని కాను. బ్రాహ్మణుడు దేశం యొక్క ఏకత్వానికే ఉన్నాడు. వాళ్ళు సమర్ధ భారత్‌ని నిర్మిస్తారు. నేను అస్పృశ్యత, వర్ణ వ్యవస్థ, ఎక్కువ-తక్కువని నేను ఎంత మాత్రం సమర్ధించను. విశ్వసించను. భారతీయలమైన మనం అందరము ఒక్కటే.


పాత్రికేయుడు- పుస్తకం వచ్చాక అందులో ప్రత్యేకత ఏమి ఉంటుంది. పాఠకుడికి ఆకర్షణ ఏమిటి.

ని.ఖా.- పాఠకులు దీనిని సమీక్ష చేస్తారు. ఇద ఒక రకమైన ఫిక్షన్. ఇది ఒక కాల్పనిక కథ. కానీ ఇది భారత దేశాన్ని దర్శింపజేస్తుంది. ఇది ఒక మంచి ప్లాట్ కలిగి ఉంది. మంచి నవల. మంచి కథ ఉంది. స్వాతంత్ర్యం తరువాత పరిస్థితులు ఎలా మారాయనే విషయాలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. ఏ విధంగా భౌతికవాదంతో మన పర్వావరణ ముడిపడింది. ఏ విధంగా భౌతికవాదం మన సమాజాన్ని బలహీనం చేస్తోంది. పశ్చిమం ఏ విధంగా మనల్ని ఆధారపడేలా చేసింది. మన సంస్థలు, సంస్కృతి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి. బ్రాహ్మణుడితో పాటు నేడు దేశం యొక్క స్థితి ఎలా ఉంది, మన బలము, బలహీనతలు ఏమిటి, భారత దేశాన్ని ఏ విధంగా బలసంపన్నం చేయగలము, ఏ విధంగా బ్రాహ్మణులను మంచి పాత్రని కల్పించి, దేశం ముందు ఉన్న సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు ఇవి అందులో ఉన్నాయి. పుస్తకం వచ్చిన తరువాత దానిని ఆమూలాగ్రం చదవనంత వరకూ రచయిత ఒక కథనంతో, నవలగా, పిక్షన్‌ని నిర్మించుకుని ఏ ఉద్దేశ్యాన్ని, సందేశాన్ని చేరవేయాలనుకుంటున్నాడో అది అర్థం కాదు. కానీ నిశ్చితంగా చెప్పేదేమిటంటే, భారత్ దర్శనమిస్తుంది, భారత్ సాధించినది తెలిసవస్తుంది. స్వాతంత్ర్యం తరువాత ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి, ఏ ఏ సంఘర్షణ చేయవలసి వస్తోంది లాంటి విషయాలు తెలుస్తాయి. బ్రాహ్మణులను కేంద్రంలో పెట్టుకుని నవల యొక్క కథ ముందుకి సాగుతుంది.


పాత్రికేయుడు- మీరు బ్రాహ్మణులే ఎందుకని కథావస్తువుగా ఎంచుకున్నారు. 


ని.ఖా.- ఇవాళ కాకపోతే రేపు ఎవరో ఒకరు రాస్తారు. తెల్లవారు చాలా శక్తిమంతులు. చాలా జ్ఞాన వంతులు ఓలంపిక్‌లో గోల్డు మెడలులన్నీ వాళ్ళే సాథించగలుగుతారు. బుకర్ ప్రైజ్‌లు, ఆస్కార్లు అన్నీ వారికే వస్తుంటాయి. వైజ్ఞానికల విషయం కూడా అలాంటిదే. నేను బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళది కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. పూర్తి చరిత్రలో చాణుక్యుడులాంటి వ్యక్తి, అతడు వ్యూహకర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ఆచూర్యు ఇలా అనేక గుణాలతో నిండిన వాడు. చాణుక్యుడు లాంటి మరొక వ్యక్తి భారత్‌లో పుట్టడేమో. చాణుక్యుడు నిజాయితీకి కొలబద్దలాంటి బ్రాహ్మణుడు. దధీచి, పరశురాముడు వీళ్ళ చరిత్ర చాలా గొప్పది. భారత్‌ ఇప్పటికీ వీళ్ళని తలుచుకుంటుంది. చరిత్రలో వీళ్ళు గొప్ర పదర్శన చేసి చూపించారు. అది మరిచిపోలేనిది. నేను వాటినే గుర్తు చేసుకుంటున్నాను. వాళ్ళు ప్రత్యేకము. చరిత్రని మార్చగలిగారు. సంరక్షణ చేయగలిగారు. దేశ సీమలను బలసంపన్నం చేసారు. అవసరమైనప్పుడు కత్తి దూసారు. శాస్త్రాలను అధ్యయనం చేసారు. భారతీయులను కలిపారు. సంస్కృతిని రక్షించారు. అటువంటి అద్భుతమైన ప్రదర్శన చేసిన వర్గం తప్పకుండా కథావస్తువు. గొప్ప కథ.


పాత్రికేయుడు- ఒక సమయంలో మీరు మీ పేరుని మార్చుకోవాలని అనుకున్నారు. దేశంలో దీనిపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. 


ని.ఖా.- నేను ప్రతీకాత్మకంగా ఒక ట్వీట్ చేసాను. 50 మంది లేదా 100 మంది కలిసి ఒక బలహీనుణ్ణి చుట్టు ముంటిట కొట్టడంలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ముస్లిము అయినా క్రైస్తవుడైనా అందరమూ భారతీయులమే ఎవరు లించింగ్‌కి గురిఅయినా ఒక భారతీయుడి ప్రాణం పోతుంది అనే సందేశాన్ని నేను నా ట్వీట్ ద్వారా ఇచ్చాను. దేశంలో ఒక ధర్మాన్ని ఆధారం చేసుకుని ఇటువంటి సంఘటనలు జరగకూడదనేదే నా అభిప్రాయం. ఇటువంటి సంఘటనల గురించి ఆలోచించాలని, వీటిని ఆపుచేయాలనే ఉద్దేశ్యంతో ఆ ట్వీట్ చేసాను. ఆ ట్వీట్ ద్వారా జాగరణ తెద్దామని అనుకున్నాను.


పాత్రికేయుడు- నియాజ్ ఖాన్ కశ్మీర్ ఫైల్స్, పఠాన్ ఈ రెండింటిని వ్యతిరేకిస్తారెందుకని.


ని.ఖా.- మీరు కశ్మీర్ ఫైల్స్ ని ఒక సారి చూడండి... బ్రాహ్మణుల..

పాత్రికేయుడు- మీపైన ప్రభుత్వానికి కూడా చాలా కోపం వచ్చిదిం...


ని.ఖా.- నేను బ్రాహ్మణులను నా సంపూర్ణ సమర్ధనని తెలియజేసాను. నేను అన్నది కాశ్మీర్ ఫైల్స్ చాలా ధనం సంపాదించింది. వాళ్ళ (బ్రాహ్మల) కథపైన డబ్బు సంపాదించారు కాబట్టి వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసానికి, ఇళ్ళ నిర్మాణానికి ఆ డబ్బుని వ్యయం చేయాలని అన్నాను. బ్రాహ్మల బాధని చూపించారని నేను సినిమాని అభినందించాను. నేను ముస్లిమ్ ఏంగల్‌లో మాట్లాడేసరికి దానిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి బ్రాహ్మణుల బాధయే నా భావనగా వ్యక్తమైంది. నాకు ఎటువంటి దురుద్దేశ్యము లేదు. కానీ ని.ఖా. అనే ఒక ప్రత్యేకమైన వాడు మాట్లాడాడు అనే దృశ్యా తప్పుగా ప్రజలలోకి వెళ్ళింది. అలా ఒక దాన్ని పట్టుకుని మరొక దానిని వదిలేయడం వలన నాకు విరుద్ధంగా ప్రచారం జరిగింది. వాస్తవానికి నాకు సినిమాపై మంచి భావనే ఉంది. బ్రాహ్మలు నిజంగా చాలా బాధని అనుభవించారు. అందుకే సినిమా బాగా ఆడింది, డబ్బు వచ్చింది. కాబట్టి బ్రాహ్మలకి సహాయం అందించడానకి ఆ డబ్బు వెచ్చించడం నైతిక బాధ్యత అనేది నా ఉద్దేశ్యం. 


పాత్రికేయుడు- మీ పుస్తకం విపణిలోకి రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది.


ని.ఖా.- 10-15 రోజులలో వస్తుంది. బహుశా మార్చిలో. అమెజోన్, కిండల్‌లో కూడా లభిస్తుంది. 


పాత్రికేయుడు- పుస్తకావిష్కరణకి ఎవరిని పిలుస్తున్నారు..


ని.ఖా.- ఎవరిని పిలవాలనేది ఇంకా అంతిమ నిర్ణయం అవ్వలేదు.

పాత్రికేయుడు, ని.ఖా.- కృతజ్ఞతలు..


https://www.youtube.com/watch?v=Rxy4omX515I&ab_channel=NBTMP-Chhattisgarh

కామెంట్‌లు లేవు: