26, ఫిబ్రవరి 2023, ఆదివారం

ఆత్మేతరములు

 ఆత్మేతరములు 

ఆత్మేతరములు  అనే పదంలోనే ఆత్మకాదు ఆత్మకన్నా వేరుగా వున్నవి అనే అర్ధం స్ఫురిస్తుంది. అంటే మనకు ఒక విషయం గోచరిస్తుంది అదేమిటంటే ఆత్మ ఒక్కటీ ఒక్కటీ ఆత్మకానివి మిగిలినవి. అంటే మిగిలినవి అన్నీకూడా ఆత్మ కన్నా భిన్నంగా ఉన్నాయని అర్ధమే కదా.  దానిని బట్టి మనం అర్ధం చేసుకునేది ఏమిటంటే ఆత్మ అన్నిటిలో లేదు, కలవదు  అది తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం. 

ఎరుక: ఎరుక అనేపదాన్ని మనం తెలుసుకోవటం అనే దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాం ఇది మనందరికీ తెలిసినదే.  నీకు రామారావు తెలుసా అంటే నాకు యెరుకలేదు అని అన్నాడు అంటే అతనికి రామారావు తెలియదు అని అర్ధం.  

ఎరుక కలిగి ఉండటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే దేనిని గూర్చి ఎరుక కలిగి ఉండటం అంటే బ్రహ్మను గూర్చి లేదా ఆత్మను గూర్చి అనే సమాధానం వస్తుంది. 

ప్రతివారు ఏమనుకుంటారటే  ఇన్ని రకాలుగా చెప్పటం ఎందుకు నాకు ఆత్మను గూర్చి తెలియదు తెలపండి అంటే ఏ గురువు  ఆయినా తెలిపారంటే అది ఏమయినా కావచ్చు కానీ ఆత్మకు సంబందించినది కాదు.  అంటే మరి దేనికి సంబందించినది. ఆ తెలిపిన గురువుకు నిజంగా ఆత్మా జ్ఞ్యానం ఉంటే  అతడు తెలుపలేడు అదేవిధంగా ఆత్మజ్ఞ్యానం లేకపోయినా కూడా తనకు తెలియదు కాబట్టి తెలుపలేడు. 

ఇది అసంబద్ధంగా వున్నది తెలియని గురువు తనకు తెలియదు కాబట్టి చెప్పలేక పోయాడు అనటంలో అర్ధం వుంది మరి తెలిసినవాడు ఎందుకు చెప్పలేడు అని ప్రతివారు సందేహించవచ్చు. 

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బ్రహ్మ జ్ఞ్యానం అనేది తెలిసినది కాదు అంటే తెలుసుకోలేదు, ఆలాగే తెలియపడేది కాదు ఒకరికి తెలియనప్పుడు ఇంకొకరికి తెలియపరచటం అస్సలు సాధ్యపడదు  కాబట్టి తెలియపడటం అనేది ఉండదు. అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం పొందటం యెట్లా అనే మీమాంస వస్తుంది. 

నిజానికి  బ్రహ్మజ్ఞానం పొందటం అనేదే ఉండదు. ఎందుకంటె నీవు ఏదైనా పొందుతున్నావంటే అంతకు ముందు నీదగ్గర అది లేకపోతేనే దానిని పొందగలవు. నీ దగ్గర ధనం లేదనుకో నీవు సంపాదించి ధనాన్ని పొందగలవు, నీ దగ్గర ఏదైనా వస్తువు గురించి, కానీ విషయం గురించి గాని జ్ఞ్యానం లేదనుకో దానిని తెలుసుకున్న పండితుడిని గురువు గా భావించి అయన వద్దనుండి తెలుసుకొని పొందవచ్చు. దీనిని బట్టి మనకు ఏమి అర్ధమౌతుంది అంటే నీవు పొందాలసినది అది వస్తువైనా కానీ లేక విషయమైనా గాని అది నీకన్నా వేరుగా  వుంది. అలాగే దానిని నీకు వసంగె వ్యక్తి కానీ మరొకటి గాని నీకన్నా వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు మూడు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి తెలుసుకోవలసిన వాడు అంటే నీవు రెండోవాది తెలుసుకోవలసిన విషయం అది ఏమైనా కావచ్చు అది కూడా నీ కన్నా వేరుగా వుంది. అదేమాదిరిగా తెలియచేసే గురువు కూడా వేరుగా వున్నాడు. 

ఒక మనిషి నేర్చుకునేది, తెలుసుకునేది పూర్తిగా పరోక్ష జ్ఞ్యానం మాత్రమే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుసుకునే వానికి తెలుసుకోబడే విషయం పూర్తిగా వేరుగా వుంటున్నది.  కాబట్టి సదరు విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకు నీకు కారు డ్రైవింగ్ రాదు.  నీకు తెలుసు డ్రైవింగ్ అనేది ఒక విద్య ఆ విద్య వచ్చిన నిపుణుడు కారును అదుపులో ఉంచి సరైన వేగంగా నడుపగలడు.  ఒక సమర్ధుడైన కారు డ్రైవరు ఇరుకు రోడ్లలో వీధులలో ఎంతోమంది నడుస్తున్నా కూడా ఎవ్వరికీ ఏ మాత్రం తాకకుండా నిపుణతతో నడుప గలడు.  అదే తర్ఫీదు సరిగా లేని వాని చేతికి స్టీరింగ్ ఇస్తే ఆ కారుతో పలువురుకు హాని కలిగించి కారుకు కూడా డామేజ్ చేయవచ్చు.  కాబట్టి విద్య నేర్చిన వానికి విద్య నేర్వనివానికి తేడా వుంటున్నది. విద్యను నేర్వటానికి విద్యలో ఆరితేరిన నిపుణుని శిక్షణ అవసరము. ఈ రకంగా మనం నిత్యం అనేక విద్యలను నేర్చుకుంటున్నాము. కానీ బ్రహ్మ విద్య అలా తెలుసుకోవటానికి సాధ్యపడదు. ఎందుకంటె ఇక్కడ తెలుసుకునే నీవు తెలుసుకోపడేది కేవలం నీలో దాగి వున్న నీ గురునిచే. అదేమిటో చూద్దాం. 

ప్రతివారు వారికి ఉన్న ఇంద్రియముల సహాయముతో ఈ జగతితో సంబంధం కలిగి వున్నారు. కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, ముక్కుతో వాసన చూస్తున్నారు ఇలా ఒక్కొక్క ఇంద్రియముతో ఒక్కొక్క రకమైన పని చేస్తున్నారు. ఇది సర్వసాధారణ విషయం.  కానీ నీలో దాగి వున్నది ఎవరు అదేమిటి నాలో దాగి ఎవరు లేరు నేనే వున్నాను అని నీవనవచ్చు నిజానికి నీవు నీ శరీరం కాదు నీ శరీరంలో నీ కన్నా భిన్నంగా దాగి వున్న నీవు అదే సుద్దచెతన్యమైన ఆత్మ స్వరూపం. ఈ విషయంలో కేనోపనిషత్తు 

 

ఇంకా వుంది .


కామెంట్‌లు లేవు: