26, ఫిబ్రవరి 2023, ఆదివారం

కొబ్బరి నీరు.

.. 


1   మెగ్నీషియం ను కలిగి వుంటుంది. ఇది ఇన్సులిన్ సేన్సిటివిటి ని పెంచి రక్తం లో చక్కర ను నియంత్రించడం లో సాయపడుతుంది. అంటే డయాబెటిస్ ను అదుపు చేస్తుంది.  


2 . పొటాషియం ను కలిగి వుంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది. బీపీ ఎక్కువగా వున్నవారికి ఉపయుక్తం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  


౩. అంటి యాక్సిడెంట్ లను అందిస్తుంది. ఇది కాన్సర్ ప్రమాదంనుంచి శరీరాన్ని కాపాడుతుంది. 


4 . బుసబుస పొంగే డ్రింకులు శారీరానికి అధిక ఫ్రూక్టోజ్ ను అందిస్తాయి కానీ ఆకలి తీర్చావు. అందువల్ల వాటిని తగినవారికి ఊబకాయం వస్తుంది. అదే కొబ్బరి నీరు ఆకలి తీరుస్తుంది. శరీరానికి మినరల్స్ ను శక్తిని అందిస్తుంది. అంటే సన్నబడానికి మంచిది. 


5 . పొటాషియం క్లోరైడ్ సిట్రేట్ లాంటి మలినాలను నిర్మూలించి కిడ్నీ స్టోన్స్ రాకుండా చూస్తుంది. 


ఈ సారి ఎండలో దాహం వేసినప్పుడు కొబ్బరి బోండా కోసం చూడండి. 


దాహం వేసింది కదా అని బుసబుస పొంగే డ్రింక్ తాగితే మీ శరీరానికి తీవ్రహాని తలపెట్టినట్టే !


షుగర్ పేషెంట్స్ - కొబ్బరి నీరు. 


కొబ్బరి నీటిలో షుగర్ ఉంటుంది. కాబట్టి తాగితే రక్తం లో షుగర్ లెవెల్ కొద్దిగా పెరుగుతుంది. కానీ అనేక ఆహార పధార్ధాలతో పోలిస్తే దీనిలో కార్బ్స్ తక్కువ. పైగా దీని glycemic  ఇండెక్స్ తక్కువ. కేవలం 35   అంటే షుగర్ రక్తం లోకి నెమ్మదిగా వెళుతుంది. 


అంటే అన్నం తింటే మీ శరీరానికి వెళ్లే కార్బ్స్ తో పోలిస్తే ఇది తక్కువ. దానికి తోడు అనేక పోషక విలువలు. దానికి తోడు మెగ్నీషియం  ఇది ఇన్సులిన్ సేన్సిటివిటి ని పెంచి డయాబెటిస్ తో పోరాడేందుకు సాయం చేస్తుంది. 


ఇదీ వాస్తవం. 


 తప్పు: వ్యాయామాల వల్ల గుండెపోటు , కొబ్బరి నీరు తాగితే డయాబెటిస్ , బుసబుస డ్రింక్ తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది - అనేది కరెక్ట్ కాదు



  


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

కామెంట్‌లు లేవు: