శివునికి సంబంధించిన ప్రశ్న, జవాబుల రూపంలో 🙏🙏🙏
1.లింగార్చన అనగా నేమి?
జ. మనలో లింగశరీరమనగా సూక్ష్మ శరీరం అనగా అంతఃకరణాలు కనుక మనసారా చేసే అర్చనే " లింగార్చన "అంటారు.
2) లింగం అనగానేమి?
జ) *లీనం గమయతీతి లింగం.*
*దేనియందు సమస్తమూ లయమునొంది మరల పుట్టుచున్నదో అదే లింగమ్. ఈ చరాచరాత్మక విశ్వమే లింగము / లింగస్వరూపం.*
అదే పరమాత్మకుగుర్తు.( ఒక దేశానికి జెండా ఎలా ఒక గుర్తో, అలా పరమాత్మ కి గుర్తు లింగము.)ఆ చైతన్యమే" లింగం ". ఆచైతన్యాన్ని జ్యోతి అంటారు. అదే జ్యోతిర్లింగం.
3. బేరార్చన అనగానేమి?
జ) బేరము అనగా " విగ్రహరూపం " విగ్రహరూపంలో అర్పించడమే" బేరార్చన "
4) శివునికి మహాదేవ, దేవదేవ అని ఎందుకు పేరు?
జ |సర్వదేవతాశక్తి శివునిదే. అంతేకాక మనం తప్పు చేస్తే దేవతలు శిక్షిస్తారు. దేవతలు తప్పు చేస్తే శివుడు శిక్షిస్తాడు.
అందుకు దేవదేవుడు, మహాదేవుడు,
5) బాణం అనగా నేమి?
జ) పానవట్టం లేని లింగంను బాణం అంటారు
6. దానికాపేరు ఎలా వచ్చింది?
జ )బాణాసురుడు మహా భక్తుడు. అతని పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. అతను నర్మదా తీరంలో తపస్సు చేసినప్పుడు శివుడు అనుగ్రహించి, ఇక్కడ నదిలో లభించే లింగములకు నీ పేరుతో వ్యవహారింపబడతాయని వరం ఇచ్చాడు.అందుకు ఆ పేరు.
7) అవి ఎక్కడ దొరుకుతాయి?
జ) నర్మదా నదిలో
8) శబ్దలింగమనగా నేమి?
జ) అక్షరాలకి మూలమైన *ఓంకారమే శబ్ద లింగం.
9) సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఎందుకు?
జ ) రుద్రకళలు 11. అవే ఏకాదశ రుద్రులు. అలా 5 చోట్ల ఉంటాయి. అనగా 5×11=55. ఈ 55 రుద్రకళలు సూర్యునిలో
ఉండటం మూలానా సూర్యుడు ప్రత్యక్షదైవమయ్యాడు.
( జిజ్ఞాసువుల కోసం :- ఆ 5 చోట్లు - ఆధిభౌతిక ప్రపంచం లోని 11 రుద్రకళలు),
(b) ఆధ్యాత్మ (శరీరంలో వ్యాపించిన 11
రుద్రకళలు),
(c) ఆధిదైవిక ( సృష్టిలోని 11 ప్రకృతి దేవతలు వారే అధిదేవతలు),
(d) అధియజ్ఞ ( యజ్ఞమునందు ఆరాధింపబడే 11 రుద్రకళలు), (ఆ) అధ్యంతరిక్ష అనంతంగా వ్యాపించిన అంతరిక్షంలోని 11) రుద్రతేజోకళలు ఈ 55
కళలు ఒకేచోట ఉంటే లింగం ఉంటారు. అవి సూర్యునిలో ఉన్నాయి కనుక ఆ సూర్యలింగమే ప్రత్యక్ష దైవం.
10) రుద్రాభిషేకం ఎందుకు?
జ ) 55 రుద్రకళలను కలిపి లింగంలో ఆవాహన చేయడానికే రుద్రాభిషేకం
11) గ్రహస్థితి సరిగ్గా లేకపోతే ఏo చెయ్యాలి?
జ ) రుద్ర మంత్రాలలో 55 రుద్రకళలుంటాయి. వాటితో అభిషేకం చేసినప్పుడు, శక్తివంతమై, మన గ్రహస్థితినే
మారుస్థాయి.
12.శివాలయాలలోనే నవగ్రహాలుంటాయి ఎందుకు ?
జ) గ్రహాలని ఆయా స్థానంలో పెట్టినవాడు శివుడు. శివుని పట్టుకుంటే గ్రహ బాధలుండవు. అందుకు శివాలయాల్లోనే నవగ్రహాలుంటాయి. గ్రహాలన్నీ *శివానుగ్రహాలే* .
13)అన్ని లింగార్చనల్లోకి శివుడికి ఇష్టమైనదేది?
జ ) ఆధ్యాత్మ లింగార్చన.
హృదయమునందు జ్యోతి రూపంలో ఉన్న లింగాన్ని ఆరాధించుట.
14. లింగోద్భవ కాలం లో బ్రహ్మ అసత్యం పలికాడు. అయినా బ్రహ్మకు , శివుడు వరం ఎందుకు ఇస్తాడు?
జ. విష్ణువు శివుని వద్దకు వెళ్లి, ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కి 5 ముఖములు ఇచ్చావు. అంతేకాక మొదటగా వచ్చిన దైవం అయిన బ్రహ్మను క్షమించమన్నాడు. బ్రహ్మ కూడా శరణు జొచ్చాడు.
15. మరి అప్పుడు శివుడు ఏం వరం ఇచ్చాడు ?.
జ. బ్రహ్మ కు యజ్ఞములలో గురుస్థానము ఉండేట్టు వరమిచ్చాడు.
16. కామధేనువు కు శిక్ష ఏమిటి?
జ. ముఖంతో అసత్యం పలికినందుకు ఆ భాగానికి పూజ లేదని, పృష్ఠ భాగం సత్యం పలికినందుకు అదే ఆరాధనీయ
స్థానమని చెప్పాడు.
17. మొగలి పువ్వు ను సంస్కృతంలో ఏమంటారు?
జ. కేతకీ
18. దానికి శివుడు వేసిన శిక్ష ఏమిటి ?
జ. పూజకు పనికి రావని.
19. మొగలి పువ్వు ఏమని వేడెను?
జ. పరమశివుని వైన నిన్ను చూశాక కూడా నాకు ఇంకా దోషాలుంటాయా స్వామి అని ఆర్తి గా అడిగింది.
20.శివుడు ఎలా స్పందించాడు?
జ. సంతుష్టుడైన శివుడు నీవు పూజకు పనికిరావు కానీ స్త్రీ సిగలో అలంకారం లాగా, దేవతలకు ఛత్రం లాగా ఉండి
సార్ధకత పొందుతావన్నాడు.
కెర్లెపల్లి బాలసుబ్రమణ్యము
పుంగనూరు ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
https://kutumbapp.page.link/?isi=1598954409
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి