.
*పద్యసౌరభం*
సీ॥
మదిలోన దలబోసి మమతనంతయు గూర్చి
లేఖినిం గదిలించ లేమవోలె
పదముల నొయ్యార ముదయించ నడయాడు
ప్రాసలు శ్లేషల పరిహసించు
యమకగమకవృత్తి యాశ్చర్యముల జూప
నుపమాదు లర్థాల నూరడించు
సౌందర్యమును జూపు ఛందాల నందమౌ
సరససాహిత్యాన సరసమాడు
తే॥గీ॥
హృద్యవిన్యాసమాకన్యకిష్టసఖియ
అర్థసంపద శబ్దాల నాడి పాడు
భట్టుమూర్తికి గుట్టుగా పట్టిబడిన
పద్య మెంచగ సాధ్యమ్మె? పండితులకు
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి