30, సెప్టెంబర్ 2024, సోమవారం

గీత జయంతి

 ఓం నమో వెంకటేశాయ డిసెంబర్ 11 గీత జయంతి ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు :


ఈ సంవత్సరం శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగం, 6వ అధ్యాయం పై పోటీలు నిర్వహింపబడును. అదేవిధంగా 18 అధ్యాయాలు పూర్తిగా వచ్చిన వారికి కూడా పోటీలు నిర్వహించబడును.


1.  6వ అధ్యాయం: ఆత్మ సంయమ యోగం పోటీలు


 6, 7 మొదటి గ్రూపు గాను

8, 9 రెండవ గ్రూపు గాను విభజించి 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం పై పోటీలు నిర్వహించబడును.


2.  అదేవిధంగా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పోటీలు


6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వారికి మూడవ గ్రూపుగా,

18 సంవత్సరాలు వయసు దాటి ఉన్నవారు నాలుగో గ్రూపుగా విభజించి పోటీలు నిర్వహించబడును.


 అందరికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు ఇవ్వబడును. కావున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం నేర్పించి పోటీలలో పాల్గొనే విధంగా తయారు చేయగలరు అని కోరుకుంటున్నాము.

ఇట్లు 

Cvk ప్రసాద్

టిటిడి, కార్యక్రమ నిర్వహకులు

ఉమ్మడి కృష్ణా జిల్లా

కామెంట్‌లు లేవు: