30, సెప్టెంబర్ 2024, సోమవారం

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

     *అతి సర్వత్ర వర్జయేత్**

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*అతి దానాత్ హత: కర్ణ:*


*అతి లోభాత్ సుయోధన:*


*అతి కామాత్ దశగ్రీవో*


*అతి సర్వత్ర వర్జయేత్॥*


*తాత్పర్యము:~*


*మితిమీరిన దానం వలన కర్ణుడు చంపబడ్డాడు. విపరీతమైన లోభం వలన సుయోధనుడు చంపబడ్డాడు. మితిమీరిన కామం వలన దశకంఠుడైన రావణాసురుడు చంపబడ్డాడు. అతి అనేది అన్నిచోట్లా వర్జింపబడవలసినదే!*


*వ్యాఖ్య :~*


*తన పుట్టుకతోనే ఉన్నటువంటి సహజ కవచకుండలాలని తీసివేస్తే అది తన చావుకి కారణం అవుతుందని తెలిసికూడా, వచ్చినవాడు శత్రువని తెలిసి కూడా తన దాన గుణాన్ని అనుసరించి కవచకుండలాలు దానం చేసిన కర్ణుడికి చివరకి మహాభారత యుద్ధంలో అదే అతని చావుకి కారణం అయింది. హద్దులు మీరిన దాన గుణం మంచిది కాదు. అందుకే, తన్నుమాలిన ధర్మ పనికి రాదు అనిపెద్దలు చెపుతారు.*


*ఐదు ఊళ్ళిచ్చినా చాలు పాండవులకి అని శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన రాయబారానికి వస్తే తన అహంకారపూరితమైన లోభత్వం వలన నిరాకరించాడు దుర్యోధనుడు. చివరకి అదియే మహాభారత యుద్ధానికి దారి తీసి అసంఖ్యామైన జన నష్టానికి దారి తీసింది. తను, అంటే దుర్యోధనుడు కూడా మరణించాడు. విపరీతమైన లోభం కూడా వినాశనానికి హేతువు అవుతుంది.*


*వనవాసంలో ఉన్న రాముని భార్యని ప్రతీకారచర్యతో అపహరించి ఆమె అందానికి దాసుడై మితిమీరిన కోరికతో వివాహమాడమని బలవంతంగా నిర్బంధిస్తాడు. అదే అతని చావుకి కారణమైంది. శ్రీరాముని చేతిలో సంహరింపబడ్డాడు. హద్దులు దాటిన కోరికలు పతనానికి దారి తీస్తాయి.*


*కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు మనిషి పతనానికి వినాశనానికి మూల కారణమని అనేక ఉదాహరణలు మన దేశ చరిత్రలోను ప్రపంచ చరిత్రలోనూ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రస్తుత ప్రపంచంలో కూడా వాటిని ప్రతి నిత్యమూ ఏదో మూల అటువంటివి జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత!*


*వీటి అన్నిటినుండీ మనిషి తనని తాను సంరక్షించుకునేందుకు మంచి విద్య, మంచి వాతావరణంలో పిల్లల పెంపకం చాలా ముఖ్యం. ఇది తల్లిదండ్రుల మరియు సమాజం యొక్క బాధ్యత.*


*అందుచేతనే, అతిసర్వత్ర వర్జయేత్ అనేది మన నిత్యజీవితంలో విస్త్రుతంగా ఉపయోగించే నానుడి అయింది.*


*అదియే ఈ సుభాషితంలోని ఉద్దేశం.*


*ఇదే అర్థంవచ్చే మరొక శ్లోకంకూడా ప్రచారంలోవుంది.*


*అతిదానాత్ బలిః బద్ధః*

*హ్యతిమానాత్ సుయోధనః |*

*వినష్టో రావణో లౌల్యాత్*

*అతి సర్వత్ర వర్జయేత్ ” ||*


*మితిమీరిన దానం వల్ల బలిచక్రవర్తి బంధించబడ్డాడు. మితి మీరిన స్వాభిమానం దుర్యోధనుణ్ణి నాశనంచేసింది. అదుపుతప్పిన (స్త్రీ)లోలత్వం రావణాసురుడిని రాలిపోయేలాగ చేసింది. (అందువల్ల) అతి దేనిలోనైనా పనికిరాదు”.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: