#బెంగాల్_హింస - కలకత్తా హై కోర్ట్ - మమత ప్రభుత్వం
మేము నియమించిన జాతీయ మానవ హక్కులు కమిటీ రిపోర్ట్ పరిశీలించిన మీదట
మాకు అర్ధం అయింది ఏమిటంటే?
* ఫిర్యాదుదారులు మాకు చెప్పినవి నిజంగానే జరిగినట్లు ఉన్నాయి.
* ఎన్నికల తరువాత విపరీతమైన హింస జరిగింది. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు
* మేం అడిగినా కూడా హింస ఏదీ జరగలేదు అనే బుకాయింపు ధోరణితోనే తోనే రాష్ట్రప్రభుత్వం ఉంది.
* ఈ హింస లో చాలా మంది హత్య చేయబడ్డారు
* చాలా మంది స్త్రీలు అత్యాచారాలకు గురి అయ్యారు
* మైనర్ ఆడపిల్లలను కూడా విడిచిపెట్టలేదు
వారిని అతి దారుణంగా హింసించి అత్యాచారాలు చేశారు
* చాలా మంది ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి
* భయంతో చాలా మంది తమ ఇళ్లు ఆస్తులు వదులుకుని పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు.
* అలా వలసపోయిన వారు మళ్లీ తమ ఇళ్లకు వచ్చి తమ సాధారణ కార్యకలాపాలు నిర్వర్తించుకునే అవకాశం కలిగేటట్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి నమ్మకం కానీ భరోసా గాని కల్పించే చర్యలు ఈ రోజు దాకా తీసుకోలేదు.
* చాలా సంఘటనల్లో పోలీసులు ఫిర్యాదులు స్వీకరించలేదు. కొన్నింటిలో ఫిర్యాదుదారులపై తిరిగి కేసులు బనాయించారు.
* ఫిర్యాదుదారులు వారి ప్రాణాలకు, ఆస్తులకు భవిష్యత్ లో ప్రమాదం అని చెప్పి రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ కి కానీ NHRC మెంబర్లకు కానీ వారి పేరు చెప్పడానికి , జరిగిన హింస చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి.
* రాష్ట్రంలోని వివిధ విభాగాలు NHRC కమిటీ మెంబర్లకు సమాచారం ఇవ్వడం పట్ల ఆసక్తి చూపలేదు
* హింస వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు
రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం అందించలేదు. ఆఖరుకు రేషన్ సరుకులు కూడా ఇవ్వడం లేదు
* ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా NHRC కమిటీ సభ్యులపై దాడి జరిగింది. పోలీసులు తగు రక్షణ కల్పించడంలో విఫలం చెందారు.
అని కలకత్తా హై కోర్టు మమత ప్రభుత్వాన్ని ఆక్షేపించింది.
అన్ని ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని, హింసకు గురి అయిన వారికి భద్రత కల్పించి వైద్య సదుపాయం అందించాలని అంతేకాక ముందుగా హెచ్చరించినా కూడా కమిటీ సభ్యులపై దాడి అరికట్టడం లో విఫలమైన కలకత్తా సౌత్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పైన పోలీసు అధికారులపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.
తదుపరి వాయిదా జులై 13న.
ఈ పైన చెప్పిన సంఘటనల్లో ఒక్క 10 శాతం
ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం లో జరిగి ఉంటే ఫేస్ బుక్ మేధావులు ఈ సరికే తోడేళ్ళులా యోగి మీద పడి పోస్టులతో హిసించేవారు. కానీ దారుణంగా జరుగుతున్న ఈ హింస తమ సెక్యూలర్ ప్రభుత్వం లో జరుగుతోంది, చస్తున్నది చావడానికి అన్ని అర్హతలు అంటే మతతత్వ బిజెపి కి మద్దత్తు ఇవ్వడం వంటివి సంపాదించిన హిందువులు చస్తున్నారు కాబట్టి నోళ్లు కుట్టేసుకున్నారు..
రోజూ ప్రాధమిక హక్కులు, మానవ హక్కులు, చట్టాలు అంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వీరు ఇన్ని రోజులుగా జరుగుతున్న ఈ దారుణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?
ఒక్కటే కారణం..బిజెపి అన్నా ఆరెస్సెస్ అన్నా నరనరానా ద్వేషం. వీరి ద్వేషం ఎంతలా పెరిపోయింది అంటే ఏ పాకిస్తాన్ వాడో చైనా వాడో వచ్చి ఏ మోడీ నో యోగినో లేపేస్తే సంబరాలు చేసుకునేంత ఉన్మాదంగా తయారు అయ్యారు ఈ ఉదారవాదులు.
హిందువులకు పై వారి వల్ల కంటే ఈ సెక్యూలర్ ముసుగులో ఉండే హిందూ ద్వేషులే ప్రమాదం.
...చాడా శాస్త్రి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి