౦ పూర్ణం గూర్చి వేదం వివరణ. పూర్ణాత్ పూర్ణమిదం....జీవ మనుగడ కూడా. ఆక్సిజన్ సమస్త జగత్తుకు మూలం. యిది ప్రాణ వాయువు. పంచభూతాత్మమకమైన జగత్తుకు మూలం. దీనికి కూడా చాలా ఉపాదులు కలవు. వృక్షములు, అగ్ని రూపంలో గల సూర్య శక్తి వలననే నీరు. నీరు కూడా జీవ మనుగడకు మూలం. నిప్పు, నీరు రెండును దేహమునకు మూలము. యింత అనంతమైన జీవ రాశికి ఆక్సిజన్ ప్రకృతి పరంగా మాత్రమే తప్ప కృత్తిమంగా తయారు చేయలేదు శాస్తీయవిఙ్ఞానం.వకవేళ తయారు చేసినా దానికి మూలమైన ప్రకృతిని నాశనం చేసి చెయ్యాలి. ప్రకృతిని ఆరాధన చేయుట మనిషి ఆవిర్భావం నుండి మూల సూత్రంగా తెలిసియున్నది. ప్రాణవాయువును మనకు మనమే శుద్ది చేయుట ప్రకృతి నుండి నేర్చుకోవాలి.అది ఆది అంతము లేనిది. అది ప్రాణం. వాయురూపంలో.అది అందరికీ తెలిసిన సత్యమే. అందుకు వృక్ష సంపద యే మూలం. మనకు అడ్డుగాయున్నాయని దేనినైనా నాశనం చేయు ప్రవృతి రాక్షస లక్షణము. మన కోరికలకు ప్రకృతిని నాశనం చేయుట కూడా అంతే. ప్రకృతిని ఆరాధనయే దైవారాధన.మనిషి పుట్టుకకు ముందే మానవ జీవనమునకు కావలసినవి సృష్టించుట జరిగినది. అవి పుట్టిన తరువాత అనుభవిస్తున్నారు. సృష్టించిన కర్తలు కృతఙ్ఞతలు కలిగియుండుచయే మానవ ధర్మం.అందుకు విరుద్దంగా నడుచుట అధర్మం రాక్షస ప్రవృత్తి. అందుకు మనకన్నా అవి అన్నియు ముందే సృష్టి జరిగినవి. కావున వాటిని గౌరవించదగినవి. కృతజ్ఞతతో చూడబడింది. ఏ మతం గాని ఏదైవంగానీ ప్రకృతిని జయించుట అనగా దాని పట్ల కృతఙ్ఞతలు చూపుటయే దైవం. ముఖ్యంగా మనిషి ఎలా జీవించాలో నేర్పినది వేదం.అనగా అది వివరించినది అవగాహన చేసుకొని తెలుట ఙ్ఞానం. అనగా సృష్టి జరగక ముందే వీటి క్రియేటివిటీకి సంబంధించిన మూల సూత్రములు విశ్వ వ్యాప్తమై యున్నవి. అఙ్ఞానంవలన వలన మనం సృష్టి చేసేము అనుకుంటున్నాను. యిప్పటికి చాలా విషయములు ప్రకృతికి సంబంధించిన వస్తువులలో చాలా భాగం మూల బీజ లక్షణములు ప్రకృతి పరంగా శాస్త్ర పరంగా తెలియదు.అయినప్పటికీ వాటిని అనుభవిస్తూనే వుండుట మాన జీవనంలో భాగమై యున్నవి. నిత్య జీవితంలో మన నడక ప్రతీదీ వక ఉపనిషత్ సారమే. వేద సారమే ప్రతీ చర్య, నడక కూడా.చర్యకు ప్రతి చర్య వుండుట సత్యం. లేనియెడల చర్య అసత్యం. చర్య లేదని వప్పుకొనుట అఙ్ఞానంవలన. ఎందుకంటే అది ఎవరో వకరి వల్ల ప్రేరేపిత మైనది. దీనినే *ప్రేరేయత్ తస్యయత్ భర్గ తత్ వరేణ్యం ఉపాస్మహే.అది నువ్వే కావచ్చు ప్రధాన సూత్ర ధారుడువి.ఏదైతే మన చర్య వలన తెలియుచున్నదో దానినే మనం ఉపాసన చేయుట. అది ఏదైనా కానీ. అనంతమైన ఙ్ఞానం తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి