🚩అగ్రహారము!
#అగ్రహారము బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం.
అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా
బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు.
సర్వాగ్రహారము అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం.
శ్రోత్రియాగ్రహారము అనేది విద్యల కోసం ఇచ్చిన గ్రామం.
జోడి అగ్రహారము, లేదా బిల్మకా అగ్రగారము లేదా, కట్టుబడి అగ్రహారము రాబడిని బట్టి హెచ్చుతగ్గులతో ఉండే అద్దెకు ఇచ్చిన గ్రామం.
అగ్రహారికుడు అంటే అగ్రహారానికి చెందిన బ్రాహ్మణుడు.
పన్ను రాయితీతో గానీ, పన్ను లేకుండా గానీ ఉన్న గ్రామభూములు కలవాడిని అగ్రహారమనుభవించేవాడు అంటారు.
ఈ అగ్రహారములకు ఎ విధమైన బాధ కలుగకుండగ చేసి రాజులు వానికి సర్వస్వతంత్రములను కల్పించెడివారు. వీనిపై ఏవిధమైన పన్నులను విధింపబడకుండినవి. ఇందలి భూమిపై వచ్చు ధాన్యమంతయూ అగ్రహారీకులదే. రాజకీయోద్యోగులకు ఇందు ప్రవేశము లేకుండెడిది. అందలి పండితులను అన్యాపేక్షలేక సర్వకార్యములను నిర్వహించుకొనుచుండిరి. ఇటులన్నివిధములను నేటి విశ్వవిద్యాలయములను మించిన స్వాతంత్ర్యము కలిగి ఈ అగ్రహారములు అనన్య దృష్టితో వైదిక విద్యను వ్యాపింపజేయుచుండిరి.
With the courtesy of SRI VINJAMURI VENKATA APPAARAO GARU..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి