*మనం మరచిపోయిన తెలుగు*
అరసున్న [ *c*], బండి ‘ *ఱ* ‘లు ఎందుకు?
*అరసున్న* బండి ‘ *ఱ* ‘లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!
అరసున్న, ఱ ల వల్ల *అర్థభేదం* ఏర్పడుతొంది.
పదసంపదకి ఇవి తోడ్పడతాయి.
ఎలాగో చూడండి:
*ఉదా*:-
అరుఁగు = వీది అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏఁడు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కాఁపు = కులము
కాపు = కావలి
కాఁచు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువుకాలము
కాఱు = కారుట (స్రవించు)
చీఁకు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱుఁగు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దాఁక = వరకు
దాక = కుండ, పాత్ర
నాఁడు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పేఁట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పోఁగు = దారము పోఁగు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బోఁటి = వంటి [నీబోఁ టి]
వాఁ డి = వాఁడిగాగల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఱు= మరొకవిధము
మడుఁగు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి