27, డిసెంబర్ 2023, బుధవారం

భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ*

*ఉఱికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల*

*చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార*

*నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మఱల దిగువ*


శ్రీకృష్ణుడు రథంలో సారధిస్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపులో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో క్రిందికి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు కంపించిపోయింది. తల నరకటానికి చక్రాన్ని చేతిలో అమర్చుకొని తనపైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకొన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. ‘స్వామీ! నిన్నేనమ్ముకొన్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు. నా పరువు కాపాడు’ అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగుమీదికి దూకే సింహంలాగా మెరసిపోతూ ‘ఉండు, అర్జునా! నన్ను వదలిపెట్టు. ఈనాడు భీష్ముణ్ణి చంపుతాను. నిన్ను కాపాడుతాను’ అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి, నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: